CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అయ్యో ! మాలిక

Share it:

 


చిన్న వయసులోనే కిడ్నీలు దెబ్బతిన్నాయి

వారానికి మూడు సార్లు డయాలసిస్

ఆర్థిక పరిస్థితి శూన్యం-దానికి తోడు కరోనా

స్పందిస్తున్న దాతలు

మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన 23 సంవత్సరాల గాండ్ల మాలిక, బీటెక్ పూర్తి చేసి ఓ చిన్నపాటి ఉద్యోగం లో చేరింది. ఆ సంతోషం నాలుగు రోజులు కూడా లేకుండానే పోయింది. జ్వరం వచ్చిన కారణంగా పరీక్షలు చేయించగా రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అని వైద్యులు తెలిపారు. అప్పటి నుండి మంచానికే పరిమితమై వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటూ జీవితాన్ని గడుపుతోంది. మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సరైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా, ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి సిఫార్స్ చేశారు. ఓవైపు డయాలసిస్ , మరోవైపు కరోనా, దానికితోడు పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి, వీటన్నింటినీ అధిగమించి ఆర్థిక పరిస్థితి. గాండ్ల మాలిక పరిస్థితి తెలుసుకున్న కొందరు దాతలు ఫోన్ పే , గూగుల్ పే ద్వారా కొంత మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించారు. విషయం తెలుసుకున్న జానంపేట గ్రామానికి చెందిన అభయ్ దళిత్ సేవా సొసైటీ గాండ్ల మాలిక ఇంటి వద్దకు వెళ్లి తన తండ్రికి వైద్య ఖర్చుల నిమిత్తం ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభయ్ దళిత సేవ సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గాండ్ల మాలిక తండ్రి కరమ్ చంద్ మాట్లాడుతూ,మా కుటుంబ పరిస్థితిని గమనించి దయ గల దాతలు ఎవరైనా సహాయాన్ని అందించాలని వేడుకొనడం జరిగింది

Share it:

TELANGANA

Post A Comment: