CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి గ్రామానికి అందని ద్రాక్షగానే త్రి ఫేస్ కరెంటు లైన్

Share it:

 


*ఐలాపూర్ ఆదివాసీ గ్రామస్తుల ఆవేదన.

*ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో అనుమతి ఇచ్చిన అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వడం లేదు.

*జిల్లా కలెక్టర్ స్పందించి మా ఆదివాసి గ్రామానికి త్రీ ప్లేస్ కరెంటు లైను ఇప్పించండి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్ ఆదివాసి గ్రామానికి ఇప్పటివరకు సింగల్ ఫేస్ కరెంటు ఉంది. త్రీఫేస్ కరెంటు లైన్ వేయుట కొరకు కొమురం భీమ్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆలం నగేష్ మాట్లాడుతూ కొండాయి గ్రామం నుండి ఐలాపూర్ గ్రామం వరకు ఉన్న పదికిలోమీటర్ల త్రి ఫేస్ కరెంటు లైన్ వేయుటకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. మా గ్రామంలో 180 గడపలు 900 మంది జనాభా కలిగి ఉంది. గ్రామంలో 30 బోర్లు వేసుకున్నాము. రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రీ సమ్మక్క సారక్క మరియు నాగులమ్మ జాతర జరుగుతుంది. జాతర జరిగే సమయంలో త్రి ఫేస్ కరెంటు లేకపోవడం వలన వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడంలో నానా అవస్థలు పడుతున్నామని అన్నారు.అలాగే ప్రభుత్వ టి డబ్ల్యూ ఏయుపిఎస్ పాఠశాలలో బోరు ఉంది. గ్రామాల్లో తాగునీటి బోరు మరియు వాటర్ ట్యాంక్ వుంది. గ్రామపంచాయతీ మరియు పోస్ట్ ఆఫీస్ ఉంది. 60 మంది రైతులు కలిసి ఏటూరు నాగారం ఐటిడిఏ గిరి వికాస పథకం ద్వారా 30 బోర్లు కూడా వేయించుకున్న, త్రి ఫేస్ కరెంటు లేక బోర్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. మా గ్రామంలో గవర్నమెంటు టి డబ్ల్యూ పి ఎస్ పాఠశాల ఉంది. కానీ సరైన విద్యుత్ సదుపాయం లేక ఉపాధ్యాయులు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరియు అదే పాఠశాలలో హరితహారం పథకం ద్వారా నర్సరీ మొక్కలు పెంచుతున్నారు. కానీ త్రి ఫేస్ కరెంటు లేక మోటార్ స్టార్టర్ పదేపదే కాలిపోవడం వలన మొక్కల సక్రమంగా పెంచలేక పోతున్నారు. మా గ్రామంలో మంచి నీళ్ల బోర్ వాటర్ ట్యాంక్ ఉంది. కానీ సింగల్ ఫేస్ కరెంటు సరిపోకపోవడం వలన మోటార్ స్టార్టర్ కాలిపోవడం జరుగుతుందనీ త్రి ఫేస్ కరెంటు లేక ప్రజలకు మంచినీళ్లు అందించలేక పోతున్నారు. ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి కొండాయి గ్రామం నుండి ఐలాపూర్ గ్రామం వరకు త్రి ఫేస్ కరెంటు లైన్ మంజూరు చేసినప్పటికీ అటవీశాఖ అధికారులు త్రి ఫేస్ కరెంటు లైన్ వేయుటకు అనుమతి ఇవ్వడం లేదు. కావున మా గ్రామ ప్రజల బాధలు అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ స్పందించి కొండాయి గ్రామం నుండి ఐలాపురం గ్రామం వరకు గల పది కిలోమీటర్ల త్రి ఫేస్ కరెంటు లైన్ వేయుటకు అటవీ శాఖ అధికారుల నుండి అనుమతులు ఇప్పించాలని ఆలం నగేష్ అన్నారు. అలాగే గతంలో ఆదివాసి ఉద్యమ నాయకులు అందరితో కలిసి మీ సహకారంతో 28 -12 -2020 రోజున ఐటిడిఎ ముట్టడి తో మా ఐలాపూర్ గ్రామానికి రోడ్డు పనులు చేయడానికి అటవీశాఖ అనుమతులు ఇచ్చి త్రి ఫేస్ కరెంటు మంజూరు చేశారు. కానీ అటవీశాఖ అధికారులు మళ్లీ కొరివి పెడుతున్నారు.

 21-05-2021న ములుగు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు లో స్థానిక ఎమ్మెల్యే సీతక్క ను కలిసి వినతిపత్రం అందించిన అనంతరం ఆలం నగేష్ మీడియాతో మాట్లాడుతూ ఆదివాసి గూడాలకు రోడ్లు, కరెంటు తదితర అభివృద్ధి పనులను అడ్డుకుంటూ ఆదివాసీల చట్టాలు పేసా, 1/70 తదితర చట్టాలను ధిక్కరించి, పేసా గ్రామ సభల అనుమతులు లేకుండా 5వ షెడ్యూల్డ్ ఏరియాలో అటవీశాఖ అధికారులు చెరువులు, చెక్ డ్యామ్లు, వాచ్ టవర్స్, తదితర పనులు చేపడుతూ ఆదివాసి గూడెం అయిన ఐలాపూర్ గ్రామానికి మంజూరైన త్రి ఫేస్ కరెంటు లైన్ పనులు చేయడానికి అటవీశాఖ అధికారులు కొరివి లు పెడుతున్నారు. త్రి ఫేస్ కరెంటు లైన్ అనుమతులు ఇవ్వని ఎడల గతంలో లాగా ఐటీడీఏ కార్యాలయం ముట్టడించినటు ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయానికి కూడా ముట్టడిస్తామని అన్నారు. స్థానిక శాసన సభ్యురాలు సీతక్క మాట్లాడుతూ ఈ విషయంపై కలెక్టర్ మరియు అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతానని ఐలాపురం గ్రామస్తులతో అన్నారు. ఈ కార్యక్రమంలో పీరీల భాస్కర్, పీరీల సురేష్, ఆలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: