మన్యంటీవీ,దమ్మపేట:
దమ్మపేట పట్టణంలో కోవిడ్ నిబంధన లో భాగంగా ఇదే ఆసరాగా భావించిన పోలీసు వారు వ్యాపారస్తులకు విచ్చలవిడిగా ఫైన్ లు వేస్తు ఇబ్బందులు పెడుతున్నారని వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మన్యం రమేష్, కె వి సత్యనారాయణ లు స్థానిక ఏంఎల్ఏ దృష్టికి తీసుకువెళ్లగా, ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫైన్స్ విధించ వద్దని ఎస్ఐకి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి షాపు ముందు సామూహిక దూరం పాటించే విదంగా ముగ్గుతో డబ్బాలు వేయాలని, పది గంటలకల్లా షాపులు మూసివేయాలని వ్యాపారస్థులకు తగు సూచనలు ఇచ్చారు.
Post A Comment: