CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా సమస్యలు పరిష్కరించాలి

Share it:

 


✊✊✊ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేసిన ఆశావర్కర్లు.

మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: దేశ వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మెలో భాగంగా, ఆశా వర్కర్ల ఆలిండియా ఫెడరేషన్ పిలుపు మేరకు, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు)ఆధ్వర్యంలో తెలంగాణ వాలంటరీ & కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆషా) యూనియన్ సభ్యులు సమ్మె నిర్వహించి, మండలంలోని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్నపురెడ్డిపల్లి ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ వద్ద ప్లకార్డులతో నిరసనలు తెలియజేశారు. సమ్మె సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చేపట్టాలని, ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని, కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న తమకు, అదనపు వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అత్యల్ప ఆదాయంతో కుటుంబపోషణ భారం అవుతున్నందున కనీస వేతనం 21 వేల రూపాయలు ఇచ్చి, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, కరోనాతో మరణించిన ఆషాలకు, రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని , మాస్కులు,శానిటైజర్లు, గ్లౌజులు, పిపిఇ కిట్లు ఇవ్వాలని, పిఆర్సి గైడ్లైన్స్ తమకు వర్తించే విధంగా, ఉత్తర్వులు జారీ చేయాలని, తదితర పెండింగ్లో ఉన్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అన్నపురెడ్డిపల్లి మండల, ఎర్రగుంట-పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్కు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మెలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు-కొండపల్లి శ్రీధర్, నాయకులు-దాసరి సీతారాములు. ఆషా వర్కర్లు యూనియన్ నాయకులు- నాగమణి, రమాదేవి, ముంతాజ్, బేబీ, లక్ష్మి , సీత. ఆషాలు-మణి, సునీత, కవిత, నాగేంద్ర, అనురాధ, నాగేశ్వరి, తదితర ఆషా వర్కర్లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: