CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెల్త్ ఆడిట్ నిర్వహణ ప్రక్రియ నిరంతరం జరుగుతుండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి తెలిపారు.

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం:-

మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి ఇంటింటి సర్వే నిర్వహణ, కరోనా వ్యాధి చికిత్సలు, ప్రభుత్వ ప్రైవేట్, సింగరేణి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు, వినియోగం, చికిత్సలు పొందుతున్న వ్యాధి గ్రస్టులు తదితర అంశాలపై వైద్య, జడ్పీ, డిఆర్డిఏ, డిపిఓ, మున్సిపల్ కమిషనర్లు, కోవిడ్ కేంద్రాల నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుండి ప్రభుత్వం లాక్ డౌన్ విధించినందున పటిష్ట పర్యవేక్షణ చేస్తూ జనసంచారాన్ని నియంత్రణ చేయాలని, నిబంధనలు ఉల్లంచిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించాలని చెప్పారు. జిల్లాకు ఆక్సిజన్ ట్యాంకర్ల వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడైనా వాహనాలు ఆపినట్లయితే తక్షణం తన దృష్టికి తీసుకురావాలని ఆక్సిజన్ వాహనాలు, ఆర్ఓకు సూచించారు. వినియోగించిన సిలెండర్లును తక్షణం నింపుకుని సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సిలెండర్లు నింపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కెటిపిఎస్లో ఆక్సిజన్ ను పరిశీలన చేసే అధికారులు ద్వారా ఆక్సిజన్ శాతాన్ని పరిశీలన చేపించాలని చెప్పారు. కరోనా విధులు నిర్వహణకు విధులు కేటాయించిన సిబ్బంది విధులకు హాజరు కాకపోతే విధుల నుండి సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు యంబిబిఎస్ చదివిన వైద్యాధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. కేవలం రిస్క్ ఉన్న కేసులను మాత్రమే కొత్తగూడెం, భద్రాచలం ఆసుపత్రులకు రిఫర్ చేయాలని, మనకెందులే రిస్క్ అని ప్రతి కేసును రిఫర్ చేయకుండా చికిత్సలు అందచేయాలని ఆయన సూచించారు. ప్రమాదపు, ప్రసవపు కేసులను 108 వాహనాల్లో తరలించాల్సిన అవకాశం ఉన్నందున కోవిడ్ వ్యక్తులను అత్యవసర చికిత్సలకు అదనపు వాహనాలను 24 గంటలు అందుబాటులో ఉంచు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదనపు సిలెండర్లు కొరకు డిఆర్డిఓకు రిక్విజిషన్ ఇవ్వాలని, రిక్విజిషన్ లేకుండా సిలెండర్లు సరఫరా చేయమని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు కొరకు ప్రభుత్వం సూచించిన ధరల కంటే అధిక చార్జ్ తీసుకుంటే 07844-241950, 08744-246655 కంట్రోల్ రూము నెంబర్లుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు రద్దీ నియంత్రణకు ముందస్తుగా టోకెన్లు జారీ చేయడంతో పాటు మార్కింగ్ వేయించాలని, రద్దీ నియంత్రణ చేయకపోతే వ్యాధి వ్యాప్తి జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. సర్వే పూర్తయినంత మాత్రానా వ్యాధి తగ్గినట్లు కాదని, హెూం కిట్లు పంపిణీ చేసిన వ్యక్తులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఆసుపత్రిలో పరీక్ష నిర్వహణలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఆటోల్లో ప్రయాణికులతో కలిసి వెళ్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని ప్రజలు అర్ధం చేసుకుని ఇతరులతో కలవకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయనచెప్పారు. 

ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ అనుదీప్, జడ్పీ సిఈఓ విద్యాలత, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, ఔషద నియంత్రణ అధికారి బాలక్రిష్ణ, వైద్యాధికారులు శిరీష, ముక్కంటేశ్వరావు, వినోద్, సుజాత, చేతన్, నాగేంద్రప్రసాద్, కోవిడ్ కేంద్రాల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: