CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడుసాగుదారులు అధైర్యపడవద్దు

Share it:

 




అటవీ అధికారులు సమన్వయం పాటించాలి

లాక్‌డౌన్‌లో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు 


మన్యం మనుగడ,పినపాక : 


పినపాక మండలంలో పోడుసాగుదారులు అధైర్యపడవద్దని, పోడుసాగుదారులకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ,కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు పాటిస్తున్న పోడుసాగుదారులను ఇబ్బందులకు గురి చేయడం పద్దతి కాదన్నారు. ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది కరోనా సమయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. రైతులు లేకుండా గ్రామాల్లో పోడుభూములు ఆక్రమించుకోవడం సరికాదన్నారు. 

 ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సర్వే కూడా జరిగిందని, ఆ విషయం తెలిసిన ఫారెస్ట్‌ అధికారులు పోడుసాగుదారులను రెచ్చగొట్టేవిధంగా పోడుభూముల్లోకి వెళ్లడం దారుణమన్నారు. ఫారెస్ట్‌ అధికారులు పోడుభూముల జోలికి పోవద్దన్నారు. ఫారెస్ట్‌ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే రైతులు కరోనా సమయంలో ఆందోళనలకు దిగితే మరిన్ని వివాదాలకు దారితీస్తుందన్నారు. పోడుసాగుదారులకు పట్టాలు ఇప్పించేందుకు తెలంగాణా ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లారని త్వరలోనే పట్టాలు మంజూరు అవుతాయన్నారు. పోడుసాగుదారులు ఎవరు అధైర్యపడవద్దని టీఆర్‌ఎస్‌ పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: