CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులకు ఉరితాళ్లు గా మారే నల్ల చట్టాలను రద్దు చేయాలి.

Share it:

 



రైతుల పై బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం.


 రైతాంగాన్ని కాపాడుకుందాం


రైతుపోరాటానికి మద్దతుగా బ్లాక్ డే సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ డి వై ఎఫ్ ఐ

 నిరసన కార్యక్రమం

మన్యం టీవీ మంగపేట.


ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో రమణక్కపేట గ్రామంలో ఎస్ఎఫ్ఐ-డివైఎఫ్ఐ, సంఘాల ఆధ్వర్యంలో క్లబ్ రోడ్ లో బ్లాక్ డే సందర్భంగా నల్లబ్యాడ్జీలతో రమణక్కపేట లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తోకల రవి మాట్లాడుతూ..

దేశంలో గత 6 నెలల నుండి బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢీల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాడుతున్నారు.ఈ 6 నెలల కాలంలో రైతులపై అనేక సార్లు లాఠీచార్జీ,టియర్ గ్యాస్ ప్రయోగించిన మొక్కవోని దీక్షతో తమ పోరాటాని కొనసాగిస్తున్నారు. దేశంలో అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇంటర్ నెట్ కట్ చేయడం లాంటివి చేసి ,రైతులకు కరెంటు కట్ చేయడం,నీళ్ళ ట్యాంకర్లను అడ్డుకోవడం, స్థానికులు పేరుతో దాడులు,

ఉగ్రవాదుల పేరుతో ముద్ర వేయడం చేసిన రైతులు తమ పోరాటాన్నిమాత్రం ఆపలేదన్నారు. చలికి రైతులు ప్రాణాలు పోయిన సరే మొక్కవోణీ ధైర్యంతో పోరాడున్నారని అలాంటి రైతులు ఉరితాళ్ళుగా కార్పోరేట్ కంపెనీలకు బంగారు బాతు గుడ్డు గా మారుతున్న చట్టాలను రద్దు చేయాలని కోరుతున్న రైతులను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. కరోనా కోరలు చాస్తున్న రైతులు మాత్రం చట్టాలను రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కోనసాగిస్తామని పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఎస్ ఎఫ్ ఐ -డి వై ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలు పూర్తి మద్దతు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు రఘు, ఆదిత్య ,మురళి ,ఆదినారాయణ, సంతోష్ ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: