CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

Share it:

 


*కోవిడ్ వార్డు ప్రారంభం, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ అందజేత.

*వైద్య సేవలలో ఎలాంటి కొరత ఉండకూడదని అధికారులకు ఆదేశాలు.

*వడ్ల కొనుగోలు తరుగు తక్కువ తీసుకునే విధంగా చర్యలు చేపట్టండి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను శుక్రవారం గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సందర్శించారు కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన కోడ్ వార్డును ప్రారంభించారు. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ యంత్రాన్ని హాస్పటల్ కు అందించారు. హెల్త్ సెంటర్ లో అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధీమా కల్పించారు. క్వారంటైన్ లో ఉన్న రోగి దగ్గరికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆమెకు నిత్యావసర సరుకులు అందించారు. అధికారులు సిబ్బంది పర్యవేక్షణ ఎలా ఉందని విచారించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆలోచన మేరకు రోగులకు అన్ని వసతులు కల్పించాలని పర్యవేక్షణ పకడ్బందీగా జరపాలని నిర్లక్ష్యం వహించ వద్దన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేపట్టిన చర్యలు వల్ల కోవిడ్ కేసులు తగ్గాయని కోవిడ్ బారిన పడ్డ వారు కూడా పూర్తి స్థాయిలో కోరుకుంటున్నారని అన్నారు. అడవి బిడ్డలకు ప్రభుత్వం అందించే వైద్యంలో ఎలాంటి కొరత ఉండకుండా చూసుకోవాలి అన్నారు. అలాగే రైతు సమస్యలపై మాట్లాడుతూ రైతులు అమ్ముకునే ధాన్యం లో మిల్లర్లు తరుగు తీయడం లో అధికంగా తీస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ విషయంపై కలెక్టర్ ను మిల్లర్ల తో మాట్లాడి తక్కువ తరుగు తీసుకునే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హనుమంతు కె జెండాగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఏటూరు నాగారం ఏఎస్పి గౌస్ ఆలం, ములుగు డీఎంహెచ్వో అప్పయ్య, ములుగు- భూపాలపల్లి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, జిల్లా కో-ఆప్షన్ నెంబర్ వలీయాబీసలీం, ఏటూరు నాగారం,మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్పెషల్ ఆఫీసర్లు, అలాగే వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: