CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యవసర సరుకులు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


*కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి.

కరోనా ను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. 

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని గోగుపల్లి, రాంనగర్ గ్రామాలకు చెందిన 30 మంది కరోనా బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా తో ప్రజలు ఇబ్బందులు ఉన్నారని పేద ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే పేద ప్రజలకు ఆర్థిక సాయం చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులకు పోతే లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీ పథకం లో చేర్చి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి ఆరువేల రూపాయలు అందించాలని సీతక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరసవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిట మట రఘు, మండల ఉపాధ్యక్షులు ఎండి రియాజ్ గియ, ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం రాంమూర్తి, సహకార సంఘం వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు, సహకార సంఘం డైరెక్టర్ వంగ పండ్ల రవి, మాజీ ఎంపీటీసీ నర్సక్క గ్రామ కమిటీ అధ్యక్షులు సుధాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసం యాదయ్య, విద్యాసాగర్, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు ఎండీ గౌస్, అధికార ప్రతినిధి ఎండి జిలాని, యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నవీన్, గడ్డం శ్రీధర్, ఎండి రియాజ్, తోట ప్రశాంత్, మహేందర్,గార  మహేష్, జాన పట్ల రాజు, గాలిబ్, శ్రీను, రాజేష్, రమేష్, రాజబాబు, భాస్కర్, సింగిరెడ్డి శ్రీ రాములు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: