CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మావోయిస్టు దళ సభ్యుడు,మిలీషియా, కొరియర్ సభ్యుల అరెస్ట్

Share it:

 



విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ ఐపీఎస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మాట్లాడుతూ మణుగూరు హనుమాన్ టెంపుల్ వద్ద మణుగూరు సిఐ భాను ప్రకాష్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం గా కనిపించిన ఒక కారు ను తనిఖీ చేయగా కారులో డ్రైవర్ తో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులను విచారించగా వారు నిషేధిత మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారని తెలిసి వెంటనే అరెస్ట్ చేశారు. *అరెస్ట్ అయిన వ్యక్తులు* 1)సవలం. పొజ్జ అలియాస్ భీమయ్య తండ్రి బుద్ర చత్తీస్ఘడ్ రాష్ట్రం దక్షిణ బస్తర్ సప్లై టీం దళ మెంబర్,2)సోడి సీతయ్య,మహేందర్ తండ్రి రామయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మావోయిస్టు పార్టీ కొరియర్,

3)కుంజా జోగయ్య తండ్రి అప్పారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మావోయిస్టు పార్టీ మిలిషియా మెంబర్.

*వీరి వద్దనుండి స్వాధీనపరుచుకున్న వస్తువులు*


1)జిలెటిన్ స్టిక్స్- 10 2)డిటోనేటర్స్- 3 

3)నిప్పో బ్యాటరీస్- 4

4) కార్డేక్స్ వైర్ బండలు -1 5)ఎలక్ట్రికల్ వైర్- 20 మీటర్లు


వీరిని విచారించగా గత నాలుగు రోజుల క్రితం కరోనా సోకి తీవ్ర అనారోగ్యంతో ఉన్న దండకారణ్యం దక్షిణ బస్తర్ టెక్ టీం కమాండర్ అయినా కురసం గంగయ్య,తండ్రి రామయ్య 28 సం.ను హాస్పిటల్ నందు చేర్పించారు అని తెలిపారు అని,చేర్పించిన విషయాన్ని వీరి దగ్గర ఉన్న పేలుడు పదార్థాలను మావోయిస్టు పార్టీకి అప్పజెప్పడానికి వెళ్తున్నట్లు తెలిపారు అన్నారు.పైన తెలిపిన వివరాల ప్రకారం విచారించగా హాస్పటల్లో జాయిన్ చేసిన వ్యక్తి కి కరోనా సోకి తీవ్రమైన అనారోగ్యంతో మరణించినాడని తెలిసింది. అతని వివరాలు తెలుసుకో గా కురసం గంగయ్య 28 సంవత్సరాలు తండ్రి రామయ్య చత్తీస్గడ్ రాష్ట్రం ఇతను మావోయిస్టు దండకారణ్య దక్షిణ బస్తర్ టెక్ టీం కమాండర్ అని తెలిసింది అన్నారు. కిట్టి వ్యక్తులు చెప్పిన ప్రకారం మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సౌబ్రాయి,రాజేష్,నందు, సాగర్,అనేక మంది సభ్యులు కరోనా సోకి తీవ్ర అనారోగ్యం కి గురి అయినట్టు తెలిసింది.వీరికి మావోయిస్టు కు చెందిన డాక్టర్లు తెలిసీ తెలియని వైద్యం చేయడం వల్ల తీవ్ర అనారోగ్యం గురైనట్టు తెలిసిందన్నారు.కరోనా బారిన పడి అనారోగ్యం పాలైన వారు వెంటనే పోలీసుల ముందు లొంగిపోతే కావలసిన వైద్య సహాయం అందిస్తామని తెలిపారు.కరోనా విజృంభిస్తున్న సమయంలో లో అమాయక గిరిజన ప్రజలు తో మీటింగులు పెట్టి ఆదివాసి గ్రామాలలో కరోనా వ్యాపింప చేస్తున్నారన్నారు. కావున ఈ పరిస్థితులలో ఆదివాసీ గిరిజన ప్రజలు ఎటువంటి మావోయిస్టు పార్టీ మీటింగులకు వెళ్లొద్దని, అలాగే మావోయిస్టు పార్టీ వారు మీటింగ్ లు నిర్వహించవద్దని, తెలియజేస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ ఐపీఎస్ తెలిపారు.ఈ సమావేశంలో మణుగూరు ఏ ఎస్ పి శబరీష్ ఐపీఎస్,ఏడుల్లా బయ్యారం సిఐ దోమల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: