CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించి మానవతను చాటుతున్న సర్పంచులు...

Share it:

 


మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

జూలూరుపాడు మండలం లోని పలు గ్రామ పంచాయతీలలో కరోనా మహమ్మారి బారినపడి పలువురు మృతి చెందారు. కరోనాతో మృతి చెందిన వారిని సొంత కుటుంబ సభ్యులు సైతం దరి చేరని దయనీయ పరిస్థితుల్లో గ్రామ ప్రథమ పౌరులుగా మేమున్నాం అనే భరోసా కల్పిస్తూ మృతుల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ఎంతో ధైర్యంగా గ్రామాలలో యువకుల సహాయ సహకారాలతో పి పి ఇ కిట్లు ధరించి కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మండలంలోని మాచినేని పేట తండా గ్రామపంచాయతీలో మూడు రాములు కరోనాతో మృతిచెందగా ఆ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ లకావత్ గిరిబాబు ఆ గ్రామ యువకులు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. మండలంలోని గుండెపుడి గ్రామపంచాయతీ లోని రామచంద్రపురం గ్రామానికి చెందిన జి రాములు అనే వ్యక్తి కరోనాతో మృతిచెందగా గుండెపుడి గ్రామపంచాయతీ సర్పంచ్ నరసింహారావు గ్రామస్తుల సహాయంతో దహన సంస్కారాలు నిర్వహించారు. మండలంలోని బొజ్యా తండా గ్రామపంచాయతీ లో కరోనాతో ఒక మహిళ మృతి చెందగా ఆ గ్రామ పంచాయితీ సర్పంచ్ లావుడ్యా కిషన్ లాల్ ఆ గ్రామ యువకులు మహిళా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. మండలంలోని కాకర్ల గ్రామపంచాయతీలో దుబ్బ తండా నివాసి బొజ్యా అనే వ్యక్తి కరోనాతో మృతిచెందగా ఆ గ్రామ సర్పంచ్ రమాదేవి ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్ లకావత్ గిరిబాబు మరికొందరు మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. నేడు మండలంలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో కరోనాతో రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందగా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ శాంతిలాల్ గ్రామ యువకులు కరోనా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి బాధిత కుటుంబాలకు అండగా నిలవడంతో మండలంలోని పలువురు వీరి సేవలను ప్రశంసిస్తున్నారు. సంఘం నాగరాజు మన్యం టీవీ రిపోర్టర్ జూలూరుపాడు,

Share it:

TELANGANA

Post A Comment: