CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా 135 వ మే డే ఉత్సవాలు

Share it:


        

మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఏరియా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  135  ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఏరియాలోని స్థానిక ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్డి.నాసర్ పాషా,ఓసి 4 ఎస్ఆర్ఎల్టీ కోల్  ట్రాన్స్ పోర్ట్ లో మోటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు నల్లా రమేష్,సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కూనవరం గేట్ రైల్వే అడ్డాలో నాయకులు ఏ.మంగీలాల్, సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఆధ్వర్యం శివ లింగాపురం లో నాయకులు,ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ల సంఘం నాయకులు సీహెచ్. కాంతారావు,సింగరేణి పునరావాస కొత్త కొండాపురం గ్రామంలో గిరిజన నాయకులు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కోడి రామకృష్ణ లు,మేడే  జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా నాయకులు నాసర్ పాషా మాట్లాడుతూ  ఎనిమిది గంటల పనితనం కోసం ప్రాణాలు సైతం తృణ ప్రాయంగా అర్పించిన చికాగో అమరవీరుల స్ఫూర్తితో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనల వెలుగులో కేంద్రంలో ఉన్న బిజెపికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పిడికిలి బిగించాల్సిన అవసరముందని అన్నారు. కారోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా కార్మికులకు, ప్రజలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా, రైతులను నష్ట పరిచే విధంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను కారుచౌకగా అమ్మి వేసేందుకు పార్లమెంటు లో బిల్లు ఆమోదింప చేసిందని ఈ విధానాలను వ్యతిరేకించిన జర్నలిస్టులను,కార్మిక నాయకులను అక్రమ అరెస్టులతో భయపెడుతొందని ఆయన ఆరోపించారు.ఇలాంటి విధానాలను కార్మికులు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.సింగరేణి పరిరక్షణకై సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు కై,సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కమిటీ వేతనాల అమలుపై, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు అమలుకై నిర్వాసితుల సమస్య పరిష్కారానికై ఐక్యంగా ఉద్యమించాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో నాయకులు ఏ.మంగీలాల్,నల్ల.రమేష్, కోడి.రామకృష్ణ,సిహెచ్. కాంతారావు,సాగర్,రాము, రజబలి,రామకృష్ణ, నాగేశ్వరరావు,పెద్దన్న,పి. రవి,ఎస్.రవి,వెంకన్న,శ్రీ కాంత్,వీర్రాజు,శివ,రాము, యు.వెంకటేష్,డి.కృష్ణ,జి వి రావు,సమ్మయ్య,వెంకట్రావు, చంద్రం,టి వి రాజు,దేవేందర్ సతీష్,శ్రీనివాస్,ముసలయ్య,వెంకట్రావు,అమ్మమ్మ,సూరమ్మ,సరోజినీ,సారమ్మ,సంధ్య,మౌనిక,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: