CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాక్షిక లాక్ డౌన్ కి ప్రజలు సహరించాలి :ఊకె రామనాధం.

Share it:

 


మన్యం టీవీ, కరకగూడెం:

కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని దృష్టలో వుంచుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణలో తాము సైతం అంటూ కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని వ్యాపారస్తులు ముందుకు రావడం హర్షనీయమని సర్పంచ్ ఊకె రామనాధం అన్నారు, శనివారం కరకగూడెం గ్రామపంచాయతీ నందు ఏర్పాటు చేసిన గ్రామసభకు హజరైన  వ్యాపారస్తులు ఈ నిర్ణయం ప్రకటిస్తూ సోమవారం (03/05/2021) నుండి హోటళ్ళు మినహా మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే మిగిలిన అన్ని  వ్యాపారలు కొనసాగిస్తామని  ,హొటళ్ళు,జ్యూస్ సెంటర్లకు మాత్రం 3:00 గంల వరకు తెరిచి వుంచుతామని ఆతర్వాత అన్ని వ్యాపారాలు పూర్తిగా మూసివేస్తామని వారు స్వచ్చందంగా చేసే ఈ పాక్షిక లాక్ డౌన్ కి గ్రామపంచాయతీ మరియు ఇతర రెవిన్యూ అధికారులు పోలీస్ అధికారులు సహకరించాలని కోరారు, వారి అభ్యర్దన మేరకు గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ప్రజలు వ్యాపారవేళలను గమనించి సహరించాలని సర్పంచ్ రటమనాధం కోరారు. ఈ కార్యక్రమంలో యం.పి.ఓ సునీల్ కుమార్, ఉపసర్పంచ్ రావుల రవి,కార్యదర్శి ప్రశాంత్ వివిధ రకాల వ్యాపారస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: