CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉదయం 10 గంటల తరువాత రోడ్ల మీదకు వచ్చే వాహనాలు సీజ్ చేయబడుతాయి

Share it:

 



కరోన వైరస్ కట్టడి అనేది ప్రజలందరి బాధ్యత


 


మన్యం టీవీ, అశ్వాపురం:10 గంటల తరువాత ప్రజలు తమ గమ్య స్థానాలకు వెళుతున్నారు అని అది సరైన విధానం కాదని సీఐ సట్ల రాజు అన్నారు.  ఎవరు కూడా రోడ్ల మీదకు వచ్చి ఇబ్బందులకు గురి కావద్దని  వైరస్ కట్టడి అనేది అందరి బాధ్యత అని,అందుకు ప్రజలందరూ లాక్ డౌన్ ను పాటించి పోలీస్ వారికి సహకరించాలని  అన్నారు.  జిల్లా వ్యాప్తంగా 10 గంటల తరువాత అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనాలను సీజ్ చేయబడుతాయని, అత్యవసరం ఉన్న వారు తమ వెంట సరైన పత్రాలను వెంట ఉంచుకొని రోడ్ల మీదకు వెళ్లాలని అన్నారు.

అవసరాల నిమిత్తం సడలింపు సమయం లో బయటకు కు వచ్చి షాపింగ్, ఇతర పనులు ముగించుకొని వెళ్లే  వారు ముందుగా ప్రణాళిక వేసుకొని గంట లేదా అర్ధగంట ముందు తమ పనులను పూర్తి చేసుకొని  లాక్ డౌన్ సమయం అయిన 10 గంటల లోపు తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సీ.ఐ సట్ల రాజు సూచించారు. అశ్వాపురం మండలంలోని షాప్స్ యజమానులు కూడా  10 నిమిషాలు ముందుగానే   షాప్స్  మూసుకొని 10 గంటల లోపు  తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని అన్నారు. 10 గంటల తరువాత పకడ్బందీగా లాక్ డౌన్ అమలవుతుందని అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడం తో పాటు వాహనాలు సీజ్ చేయబడుతాయని సి ఐ సట్ల రాజు హెచ్చరించారు.

Share it:

TELANGANA

Post A Comment: