CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గోపాల రావు పేట, జానంపేట,దుగినేపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, సొసైటీ చైర్మన్ ముదునూరి రవి శేఖర్ వర్మ ల చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతును రాజు చేయడమే లక్ష్యంగా రైతు బీమా, రైతుబంధు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు,24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు.రైతులు పండించిన ధాన్యమును ప్రభుత్వమే రూ.1888 ల మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు.ధాన్యం కొన్న డబ్బులను వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తుందని తెలిపారు.కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో  పినపాక మండల తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో  శ్రీనివాసులు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఇ. వెంకటేశ్వరరావు ,సొసైటీ సీఈఓ చింతల రాంబాబు, సివిల్ సప్లై డి.టీ సమ్మయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు చింతపంటీ సత్యం, మాజీ వైస్ ఎంపీపీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాట్ల వాసు బాబు, సర్పంచ్ జి.నాగేశ్వరరావు, ఎంపీటీసీలు పోలిశెట్టి హరీష్,ఎగ్గడి ఉమాదేవి, తో గూడెం ఉప సర్పంచ్ బస్రి శీను, పినపాక మండలం టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపా టి సందీప్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ లు, సొసైటీ సిబ్బంది, స్థానిక రైతులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: