CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. -మాజీ ఏంఎల్ఏ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కునేంనేని.

Share it:

 



 మన్యంటీవీ,అశ్వారావుపేట:

తెలంగాణ రాష్ట్రం లో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యం మిర్చి, ఇతర పంటలను  కొనుగోలు చెయ్యాలని. ఇండ్లు కూలి పోయిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కునేంనేని సాంబశివరావు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు, ఈ రోజు అశ్వారావుపేట నియజకవర్గ సీపీఐ సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిజం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నదని అధికారం ఉన్నా లేక పోయినా కోట్ల మంది ప్రజలు ఎర్రజండా వైపు ఉన్నారని రానున్న రాజకీయాల్లో ప్రజలకు కంమ్యూనిజం మాత్రమె ప్రతాయన్మయం అని అన్నారు.రాష్ట్రం లో అధికారం ఉన్నప్పుడు వెలుగు వెలిగిన టిడిపి, కాంగ్రేస్, వైస్సార్ సీపీ లాంటి పార్టీలు ఈ రోజు కష్టాలు లో ఉన్న ప్రజలకు కంటికి కనపడకుండా పోతున్నారని, అధికారం ఉన్న లేకున్నా ప్రజల తరుపున మిలిటెంట్ గా నిలబడి ఉండేది కంమ్యూనిస్టు పార్టీ మాత్రమె అని, యువత ,విద్యార్థులు, కార్మికులు, మహిళలలు, రైతులు, కంమ్యూనిస్టు పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ మతం, ప్రాంత పేరుతో రాజకీయాలు చేస్తూ ఇన్నాళ్లు ప్రభుత్వ రంగంలో ఉన్న కంపిణీలు, పరిశ్రమలను ప్రవేట్ పరం చేయటం దుర్మార్గపు చర్యఅని, నల్ల రైతు చట్టాలు పేరుతో రైతాంగాన్ని దోచుకోవటం  కోసం బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరుతనం అని అన్నారు, తెరాస ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, డబల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని. ప్రవేట్ లెక్చరర్లుకు విద్యా వాలంటరీ లకు కరోనా సహాయం పదివేలు ప్రతి నెల ఇవ్వాలని కునంనేని డిమాండ్ చేశారు. అశ్వారావుపేట కేంద్రంలో ప్రభుత్వ ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాల .హార్టికల్చర్ అభివృద్ధికి కోసం నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సబ్యలు నరాటి ప్రసాద్, నియజకవర్గ కార్యదర్శి ఎస్డి సలీం, వై భాస్కరరావు, జి రామనాధం, చిట్టిబాబు, రామకృష్ణ, జడ శ్రీను, శివ కృష్ణ, ఎంపీటీసీ కొర్రీ భద్రం, ఎస్కె జాబ్బర్, శోభన్, రవి, రత్నకుమారి, చిన్నోడు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: