CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెవెన్యూ రికార్డులు తారుమారు ఎవరి పాపం?

Share it:

 



 లబోదిబోమంటున్న అసలు హక్కుదారులు.

 వివాదం లేని భూముల పేర ఎల్ టి ఆర్ కేసులు పరిష్కరించాలంటున్న బాధితులు


మన్యంటీవీ, అశ్వారావుపేట:

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ యజమానులకు హక్కులు కల్పించే ఉద్దేశంతో భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, భూ ప్రక్షాళన విషయం దేవుడెరుగు కానీ, ఉన్న భూములను రికార్డులు తారుమారు చేసి అసలు హక్కుదారులకు భూమి లేకుండా చేసిన ఘటనలు అనేకం అశ్వారావుపేట మండలం లో జరిగాయని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. చట్టబద్ధంగా అసలు హక్కుదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వవలసిన రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి భూ రికార్డులు తారుమారు చేశారని, తద్వారా లంచాలు ఇచ్చుకోలేని సామాన్యులు తమ భూములు కోల్పోవాల్సి వచ్చిందని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఉన్నోడిదే రాజ్యం లాగా పలు రాజకీయ నాయకులు పైరవి కారుల్లాగా మారి మంది భూములను లంచాలు ముట్ట చెప్పినవారికి కట్టబెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత తహసీల్దార్లు చేసిన అక్రమాలను సరి చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రస్తుత రెవెన్యూ అధికారులు ఆ పని చేయకపోగా, వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మరింత వివాదాస్పదంగా రికార్డులను కొనసాగిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమంగా పట్టాలు మంజూరు చేసిన నారాయణ పురం భూములను హెల్డింగ్ లో పెట్టగా, ప్రస్తుత అధికారులతో మంతనాలు జరిపి ఆ భూములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఒక ప్రజాప్రతినిధి భర్త మధ్యవర్తిత్వంతో సెటిల్మెంట్ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. నారాయణపురం రెవెన్యూ లో సర్వే నెంబర్ 97 లో దేవరశెట్టి జగన్నాథరావు వారసులు సూర్యనారాయణ కుమారులయిన దేవరశెట్టి రమేష్ కు చెందవలసిన భూమిని వేరే వారి పేరు మీద రికార్డులలో వ్రాసినారని, అట్టి భూమి ప్రస్తుతం వారి ఆధీనంలోనే ఉన్నదని, ఆ భూమి సర్వే నెంబర్ పై ఎల్ టి ఆర్ కేసు ఫైల్ అయినట్లు ధరణి సైటులో చూపిస్తుందని, అదే సర్వే నెంబర్ లో మా ప్రక్కవారు భూమిని అమ్మితే మా ఆధీనంలోనే ఉన్న భూమిపై ఎల్ టి ఆర్ కేసు ఎలా ఫైల్ చేశారో రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలని సదరు హక్కు దారుడు ప్రశ్నిస్తున్నాడు. గతంలో ఎన్నోసార్లు నివేదన యాప్ లో పెట్టినప్పటికీ, అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ, అధికారులు న్యాయం చేయలేదని బాధితులు వాపోతున్నారు. ఇలా ఎన్నో అవకతవకలు బయట పడుతున్నాయని మరియు జడ్జిమెంట్ వచ్చిన భూములకు హక్కు దారులకు భూమి అప్పగించకుండా వేరే వారి పేరు మీద కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తూ కోర్టు ధిక్కారానికి సైతం పాల్పడుతున్నారని కొందరు ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించి తారుమారైన రికార్డులను సరిచేసి అక్రమాలకు చెక్ పెట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: