CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంబేద్కర్ జయంతి చేయటమే కాదు ఆయన ఆశయాలు సాధించాలి-మంగపేట ఎస్ ఐ శ్రీనివాస్.

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం రాజుపేట లో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 130వ, జయంతి వేడుకలు ఘనంగా

నిర్వహించడం జరిగింది. ఇట్టి వేడుకలకు అతిధులుగా  జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి, మంగపేట ఎస్ ఐ శ్రీనివాస్,బీజేపీ రాష్ట్ర నాయకులు తాటి కృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కృష్ణవేణి శ్యామల నాయక్,తెరాస సీనియర్ నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ, మంగపేట సొసైటీ చైర్మన్ తోట రమేష్, ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు,  అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత రేగా పాపయ్య,అంబేద్కర్ సీనియర్ నాయకులు పగిడిపెల్లి వెంకటేశ్వర్లు, గంగేర్ల రాజారత్నం, పల్లి కొండ యాదగిరి, చిట్టిమల్ల సమ్మయ్య, దీకొండ కాంతారావు, బసారి హరికృష్ణ, ములుగు జిల్లా ఎస్సి, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు రాజమల్ల సుకుమార్, అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు కర్రి రామ్మోహన్,సీనియర్ పాత్రికేయులు, మేడ ఆదినారాయణ,కళ్ళేబోయిన శ్రీనివాస్, ఎర్రం స్వామి, వెంకన్న, మాధవ్, జానపట్ల జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు డా :అంబేద్కర్ యొక్క సేవలను కొనియాడారు.తదనంతరం ఎస్ ఐ శ్రీనివాస్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అంబేద్కర్ అంటే బహుమేధావి, రాజ్యాంగం నిర్మాత, భారతీయ మొదటి న్యాయ శాఖ మంత్రి, దళిత, గిరిజన, బహుజనులు కోసం సాంఘీక ఉద్యమం చేసిన వ్యక్తి, సమ సమాజం కోసం పోరాడిన వ్యక్తి, చదువుకుంటే మన జీవితాలు బాగు పడతాయని ప్రబోధించిన వ్యక్తి అందరికి ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ, క్రమ శిక్షణకు నిలువెత్తు రూపం, మానవ రూపంలో జన్మించి బడుగు బలహీన వర్గాలకు కొమ్ము కాసిన అపర మేధావి డా :బీ. ఆర్ అంబేద్కర్ అటువంటి మహనీయుడి జయంతి జరుకోవటమే కాకుండా అతని ఆశయాలను సాధించాలి అంటూ ఉద్వేగబరితంగా ప్రసంగించారు.

Share it:

TELANGANA

Post A Comment: