రేగా జన్మ దిన వేడుకల్లో పాల్గొన్న ములుగు జిల్లా మన్యం టీవీ ఇన్ ఛార్జ్ గోపాల్.
మన్యం టీవీ ఏటూరునాగారం:
ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు సందర్బంగా మన్యం టీవీ మన్యం మనుగడల పాత్రికేయబృందం ఆధ్వర్యంలో మన్యం టీవీ మన్యం మనుగడ పత్రికల చైర్మన్ ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాకప్పి ఆత్మీయ సత్కారం చేసారు. రేగా పుట్టినరోజు వేడుకసందర్బంగా కేక్ కట్ చేసి వేద మంత్రాల నడుమ వేద పండితుల ఆశీస్సులు తీసుకొని తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మన్యం మనుగడ ఆర్ ఎం దామోదర్ గౌడ్,మణుగూరు రిపోర్టర్ మహేష్ కుమార్, పినపాక రిపోర్టర్ శ్రీనివాస్, కరకగూడెం రిపోర్టర్ బిక్షపతి,మంగపేట రిపోర్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: