CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఏప్రిల్ 11వ తేదీ చలో గోదావరిఖని సదస్సు ను జయప్రదం చేయండి

Share it:

 


 

IFTU ఆధ్వర్యంలో ఏరియా లో విస్తృత ప్రచారం

     

మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరు లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ గోదావరిఖని లో జరుగు రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ ఏరియా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పివి కాలనీ మల్లారం అడ్డా,ఓసి 2, బంగ్లాస్ ఏరియా ఇతర అడ్డలలో కరపత్రాలు గ్రూప్ మీటింగ్ ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏరియా ఐఎఫ్టియు నాయకులు ఏ. మంగీలాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ  రాష్ట్రాల బొగ్గు గనులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఓబి వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సింగరేణిలో అట్టి తీర్పు అమలు కాకపోవడం బాధాకరం అన్నారు.ప్రస్తుతం అమలులో ఉన్న జీతాలు కాంట్రాక్ట్ కార్మికుల అవసరాలు తీర్చే పరిస్థితులలో లేవన్నారు.ఒక కాంట్రాక్ట్ కార్మికుడు భార్య ఇద్దరు పిల్లలతో  జీవించాలంటే నిత్యవసర వస్తువులు,కరెంటు బిల్లు, ఇంటి కిరాయి,పిల్లల చదువులకు వైద్యం ఇతర ఖర్చులకు ఇరవై వేల రూపాయల పైచిలుకు సంపాదన లేకపోతే ఆర్థిక ఇబ్బందులు చిక్కుకుంటారని,చిరు జీతగాళ్ళు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారన్నారు. అసలే కోల్ బెల్ట్  ఏరియాలలో నిత్యవసర వస్తువులు కూరగాయల ధరలు చుక్కల్లో కి చేరి ఉంటాయని దీంతో వీరు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.దీంతోపాటు  దురదష్టవశాత్తూ ఎవరైనా కాంట్రాక్ట్ కార్మికులు  అనారోగ్యం,సహజ మరణం,బయటి ప్రమాదాలలో చనిపోతే వారికి ఏలాంటి భీమా సౌకర్యాలు లేని కారణంగా వారి కుటుంబాలు అనాధలుగా మిగిలిపోతున్నారు అని అన్నారు.కెసీఎస్పీ కాంట్రాక్టు కార్మికుడు పంగ. మధుసూదన్ మృతి ఉదాహరణ అన్నారు.దీనిపై  కూడా  ప్రభుత్వం,సింగరేణి సంస్థ స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు నరసింహారావు, రంగయ్య,నాగేశ్వరరావు,హాతీ రామ్ భీమరాజు, సమ్మయ్య,రాజేష్, ఇమాంబీ,ఉపేంద్ర,సీత, వెంకటరమణ,ముత్తమ్మ, సీత,కల్లమ్మ,కళావతి  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: