CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవసేవే మాధవసేవ......

Share it:

 



 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్  డైరెక్టర్   నాసిరెడ్డి సాంబశివ రెడ్డి


 హీరో షోరూం యజమాని వినయ్ జ్ఞాపకార్థం శీతల చలివేంద్రం ప్రారంభం....

మన్యం టీవీ మంగపేట.

సమాజంలో మానవ సేవే మాధవ సేవఅని సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామం రైతు భవనంలో  మణుగూరు హీరో షోరూం యజమాని నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి తన కుమారుడు  నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఆధునిక శీతల ఫ్రీజర్ కూలర్ చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సాంబశివ రెడ్డి మాట్లాడుతూ, కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ఉండి కూడా సమాజ సేవ చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న హీరో షోరూం యజమాని నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, వెంకటరమణ దంపతులు ధన్యులనీ వారి సేవలను కొనియాడారు. ఇటీవలే లక్ష రూపాయల విలువైన శీతల శవపేటికను సైతం అకినేపల్లి మల్లారం గ్రామ పంచాయతీ కి బహూకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈరోజు అకినేపల్లి మల్లారం, టి. కొత్తగూడెం సరిహద్దు గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ" 30,000/-- లు  విలువైన ఆధునిక శీతల చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమన్నారు. అంతేకాకుండా రైతు భవనానికి సీలింగ్ ఫ్యాన్ బహూకరించి రైతుల మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు భార్గవ ఆటోమొబైల్స్ హీరో షోరూం యజమాని నాసీరెడ్డి విజయభాస్కర్రెడ్డి ఏడూళ్ల బయ్యారం లక్ష్మీ మోటార్స్ హీరో షోరూం యజమాని భార్గవ్ రెడ్డి వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు పచ్చిపులుసు నరేశ్,  నేలపట్ల శేషారెడ్డి చెట్టుపల్లి తిరుపతిరావు నాగిరెడ్డి, కృష్ణారెడ్డి స్థానిక రైతులు అకినేపల్లి మల్లారం  టి.కొత్తగూడెం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: