CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమస్యలు పరిష్కరించే గొంతుకకు మా ఓటు

Share it:

 


*పట్టభద్రులంతా పల్లా వైపే 

*నిరుద్యోగుల సమస్యల పరిష్కారం పల్లాతోనే సాధ్యం.

*1 లక్షా 32 వేల 889 ఉద్యోగాలు భర్తీ చేసింది, టిఆర్ఎస్ ప్రభుత్వం.

*ఇటీవలే ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలపై మా  యువనాయకులు,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  బహిరంగ లేఖ 

*ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. 

*రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు పెద్దపీట

*మరో 50 వేల ఉద్యోగాలు భర్తీకై ప్రభుత్వం సిద్ధంగా ఉంది. *నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో

*తెలంగాణ  మాల మహానాడు  రాష్ట్ర ఉపాధ్యక్షులు  గంపల శివకుమార్.

మన్యంటీవీ ఏటూరునాగారం:


పట్టభద్రులంతా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వైపే ఉన్నారని, తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు విద్యావంతుల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య నాయకులు సీనియర్ పాత్రికేయులు, సామాజిక వేత్త గంపల శివ కుమార్  అన్నారు. సోమవారం నాడు ములుగు  నియోజకవర్గంలోని ఏటూర్ నాగారం లో ఆయన నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యా వంతులను  ఓట్లు  అభ్యర్థించారు, నిరుద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,సమస్య పరిష్కారానికి కృషి చేసే నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి  అని అన్నారు,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుల్లో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి  ఒకరని, పార్టీ,ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు పల్లా అని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పల్లా ఉంటారని, ప్రశ్నించడమే కాదు ప్రశ్నకు సమాధానం వచ్చే వరకు పల్లా పోరాడుతారని తెలిపారు. ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల చేస్తున్న అసత్య ప్రచారాలపై మా  యువనాయకులు,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బహిరంగ లేఖను విడుదల చేసారని తెలిపారు.ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మే స్థితిలో ప్రజలెవ్వరు లేరని ఆయన విమర్శించారు.రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మరో 50 వేల ఉద్యోగాలు భర్తీకై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని స్పష్టం చేశారు.కాబట్టి పట్టభద్రులంతా ఆలోచించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి వేసి మద్దతు తెలపాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: