CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 ముఖ్య అతిథులుగా హాజరైన ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు,ప్రజా ప్రతినిధులు

Share it:

 👉 *విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధ్యక్షత న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ*


👉 *ప్రశ్నించే గొంతు కావాలా సమస్య పరిష్కరించే వ్యక్తి కావాలా ఓపెన్ సవాల్ విసిరిన పల్లా.రాజేశ్వర్ రెడ్డి*


👉 *ఇప్పటికే లక్షా 30 వేల పైగా ఉద్యోగాలు ఇచ్చాము,అభివృద్ధి మా దేయం*





మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, హనుమాన్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అధ్యక్షత న నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ఎప్పుడు కనపడని వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. ఎన్నికలు ముగిశాక ఎవరు కనపడరు అని కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది అని,అభివృద్ధి ఆగదు అని పట్టభద్రులు ఆలోచించి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి,మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత,ఎమ్మెల్సీ బాలసాని,తెలంగాణ రాష్ట్ర బొగ్గు గని సంఘం అధ్యక్షులు వెంకటరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం. కనకయ్య,మాజీ మంత్రి తుమ్మల.నాగేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి.శ్రీనివాసరెడ్డి,టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి తాత మధు,పాల్గొన్నారు.సభలో పాల్గొన్న ముఖ్య అతిధులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా.రాజేశ్వర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పథకాలు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా మార్చుటకై మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారని,అన్ని వర్గాల ప్రజలకు అన్ని ఉద్యోగ సంఘాలకు అందరికీ సమన్యాయం చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 45 వేల కోట్ల రూపాయల తో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని,అన్ని విషయాలు మీ కళ్ల ముందు, మీ గమన లో ఉన్నాయి కాబట్టి అభివృద్ధి కి ఓటు వేయాలన్నారు.బ్యాలెట్ లో 3వ నంబర్ పల్లా.రాజేశ్వర్ రెడ్డి మీద మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రుల ను కోరారు.ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం హయం లో ప్రభుత్వ,మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు. ఆ ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారు అనేది పట్టభద్రుల కు వివరించారు.ఎందుకు టిఆర్ఎస్ పార్టీ కి ఓటు వేయాలో ప్రతి విషయం పట్టభద్రుల కు వివరించారు.కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తుంది అని తెలిపారు. శాసనమండలి లో ప్రతి సభకు హాజరయ్యాను అని, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా న బాధ్యత నిర్వహించాను అని తెలిపారు.ఉద్యోగస్తులకు పిఆర్సి టిఆర్ఎస్ ప్రభుత్వం  త్వరలోనే పరిష్కారం చేస్తారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.అనంతరం పట్టభద్రుల ను మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తూళ్ళూరి బ్రహ్మయ్య,నియోజకవర్గ జడ్పీటీసీలు,ఎంపీపీలు,రైతు సంఘం అధ్యక్షులు, పీఏసీఎస్ ఛైర్మన్ లు, ఎంపీటీసీలు,కో అప్షన్ సభ్యులు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, యువజన నాయకులు, గ్రాడ్యుయేట్స్,పట్టభద్రులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: