CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సి.ఎం దృష్టిలో ఎమ్మెల్సీ అంటే "మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్

Share it:

 



ములుగు సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్


మన్యం టీవీ మంగపేట.

రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే "మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్"అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ఎమ్మెల్సీఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్ట మొదటి సారిగా ములుగులో శుక్రవారం రాత్రి అడుగు పెట్టిన బీజేపీ రాష్ట్ర రధసారధి బండి సంజయ్ కి జిల్లా భాజపా శ్రేణులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఎదురేగారు.ఈసందర్భంగా భాజపా యువమోర్చా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి వేణు రాముడి చిత్రపటాన్ని బండి సంజయ్ బహుకరించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణాలో రాక్షస అవినీతి పాలన కొనసాగుతుందని,రాష్టంలో ఈ పాలన పోవాలని గట్టమ్మకు సమ్మక సరళమ్మను మొక్కుకున్న కెసిఆర్ కి అధికార అహంకారం తలకేక్కింది,పదవీ బలుపుతో ఉన్న కెసిఆర్ కి బుద్ధి చెప్పాలని ప్రతి మేధావి బీజేపీ కి ఓటు వేసి గెలిపించాలన్నారు. కెసిఆర్ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే "మెంబెర్ అఫ్ లిక్కర్ కౌన్సిల్" అని పళ్ళ రాజేశ్వర్ రెడ్డి గెలిచాక తన ఆస్తులు పెంచుకున్నడు తప్ప ఎవరికి ఎం చేసింది లేదని ఆ న్నారు. ఆయన కెసిఆర్ కి గ్లాస్ లో సోడా కలపడానికే పనికొస్తాడని ఏద్దేవా చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి ఇస్తాం అని చెప్పి,ఇప్పుడు ఆ ఊసే లేదని పిఆర్సి గురించి బీజేపీ కొట్లాడితే అక్రమ కేసులు పెట్టి కొట్టిస్తూన్నారని ఉపాధ్యాలని సైతం కెసిఆర్ అవమానపరుసున్నారని . తెరాస ప్రభుత్వం వెంటి లెటర్ పై ఉందని  ఏ క్షణాన్నైనా కూలిపోవచ్చని  అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు హుసేన్ నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిది తాటి కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల కృష్ణ, యువమోర్చ జిల్లా అధ్యక్షులు సురేందర్, మండల అధ్యక్షులు యర్రంగారి వీరన్ కుమార్, ఉపాధ్యక్షులు తొండపు శ్రీనివాస్ రెడ్డి,  గంధసిరి శ్రీను, రాంగాని అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: