CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Share it:

 



 _అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వండి_ 

 _సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలి_ 

 _ఆరుబయట ప్రజలు నిద్రించ వద్దు_

 - సిఐ ఉపేంద్ర రావు  


 మన్యం టీవీ, అశ్వరావుపేట:  మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్న క్రమంలో అశ్వరావుపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర రావు పేర్కొన్నారు. అశ్వరావుపేట లో కలకలం రేపుతున్న చోరీ సంఘటనలపై ప్రెస్స్ మీట్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రజలు, వ్యాపారులు పోలీస్ నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయినా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసు వారికి వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆరుబయట నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలని కావున బయట పడుకోవడం మానేయాలని సూచించారు. ఎవరైనా పొరుగు గ్రామాలకు వెళ్లినా, వివాహాది శుభ కార్యక్రమాలు, ఇతర క్యాంపులకు వెళ్లిన ఇంట్లో ఉన్న విలువైన సొత్తును బ్యాంకులో భద్రపరచుకోవాలని పేర్కొన్నారు. ఇంటి వద్ద విలువైన వస్తువులు నగదు ఉంచరాదని అన్నారు. మండలంలో అధికశాతం ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో నిఘా వ్యవస్థ పటిష్టపరిచేందుకు గాను పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులకు  సమానమని కావున సీసీ కెమెరాలు ఏర్పాటు దాతలు ముందుకు రావాలని పేర్కొన్నారు.  సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సిఐ హెచ్చరించారు. ముఖ్యంగా కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే చర్యలు తప్పవని, ఎక్కడైనా ఇటువంటి జూద క్రీడలు జరిగితే ప్రజలు పోలీసువారికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలను సీఐ కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: