CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈనెల 17వ తేదీన కోటి వృక్షాఅర్చన

Share it:

 


*జిల్లాలో మొక్కలు నాటే ఎందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి.

*జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య


మన్యంటీవీ ములుగు/ఏటూరునాగారం:

ఈరోజు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై జిల్లాలోని సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులకు "కోటి వృక్షా అర్చన" కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పట్టణ ప్రగతి అభివృద్ధి పనులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష లో భాగంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వారు చేయవలసిన పని ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ విధమైన సమస్య ఉన్నట్లయితే తమ దృష్టికి తేవాలని ఈ సందర్భంగా సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పైన ఎవరైనా రోడ్లపై చెత్త వేసినట్లు గమనించినట్లు అయితే వేసిన వారికి పైన్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

*గ్రీన్ ఇండియా ఛాలెంజ్* లో  పంచాయతీ కార్యదర్శులు జిల్లాలో ఈనెల 17న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుట ఆదేశాలు జారీ చేసియున్నారని, ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో 1000 మొక్కలకు నాటుటకు నర్సరీలలో అందుబాటులో ఉన్న 30 సెంటీమీటర్ల పొడవు గల మొక్కలను ఎంచుకున్న స్థలం గుర్తించి నాటాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. ఈ నెల 16న 45 సెంటీ మీటర్ల తో ఫీట్స్ త్రవ్వించి సిద్ధంగా ఉంచాలని అన్నారు. సమస్త సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు 30 సెంటీమీటర్ల పొడవున్న మొక్కలు సమకూర్చుకొని మరియు మొక్కలు నాటుట కు అనువైన ప్రదేశాలను గుర్తించాలని వారు అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి విధంగా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి అన్నారు. మొక్కలు పెరుగుదలకు క్లోరిడైన్ డస్ట్ ,థైమేట్ గ్రానుల్స్ మరియు ఎరువు సమకూర్చు కోవాలని అన్నారు. మొక్క నాటిన నుండి పది రోజుల వరకు ప్రతిరోజు మొక్కకు నీరు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారులు ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం అమలు పరచుటకు    సర్పంచ్ లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు సూచనలు జిల్లా పంచాయతీ అధికారి జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా  డిఆర్డివో పారిజాతం, డివిజనల్ పంచాయతీ అధికారి దేవరాజ్,  మరియు వివిధ గ్రామ పంచాయతీ సర్పంచులు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: