CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 గుండాలలో ఘోర రోడ్డు ప్రమాదం

Share it:


* కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

* ఒకరు మృతి, 28 మందికి గాయాలు

గుండాల మన్యం టీవీ: కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా 28 మందికి తీవ్ర గాయాలు ఆయన సంఘటన గుండాల మండలం లో చోటుచేసుకుంది. ఆరుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా కొత్తగూడెం తరలించారు. ఈ సంఘటన గుండాల మండలం లోని పోతిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో జరిగింది. ఎస్ఐ ముత్యం రమేష్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శంభునిగూడెం గ్రామం శీలం మహేందర్ కు చెందిన ట్రాక్టర్ లో అదే గ్రామానికి చెందిన 36 మంది కూలీలతో మొక్కజొన్న కంకులు మిల్లు పట్టేందుకు  శంభునిగూడెం నుండి         పోతిరెడ్డిగూడెం సమీపంలోని పోడుభూముల వైపు వస్తుండగా మార్గమధ్యలో ఉప్పలపోడు వద్ద గుట్టబోడు  ఎక్కుతున్న క్రమంలో ట్రాక్టర్ ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయింది. డ్రైవర్ వెంటనే గేర్ మార్చేందుకు ప్రయత్నిస్తుండగా ట్రాక్టర్ వెనకకు వచ్చి ఇంజన్తో సహా  ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఇంజన్ పై కూర్చున్న వట్టం సమ్మయ్య(23) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పక్కన పోడు భూముల్లో పనిచేస్తున్న కూలీలు క్షతగాత్రుల ఆర్తనాదాలు విని వెంటనే గుండాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనలో ఇరవై ఎనిమిది మందికి ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వాహనాల ద్వారా ఖమ్మం, కొత్తగూడెం తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా పట్టణాలకు రిఫర్ చేశారు.

ఇల్లందు డిఎస్పి రవీందర్ రెడ్డి  సంఘటనా స్థలాన్ని  సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  పరిమితికి మించి కూలీలతో రవాణా చేయడం వల్ల ప్రమాదాలు వాటిల్లే అవకాశాలున్నాయని నియంత్రణ పాటించాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే వాహనాలు సీజ్ 

చేయడంతో పాటు యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఎస్ఐ ముత్యం రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: