CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Share it:

 



ఈ నెల 14న జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలి


ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్ నియామకం


మన్యం టీవీ, బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన తాళ్లగొమ్మురు ఐటిసి ఫంక్షన్ హాల్లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన మండల టిఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు. 


అనంతరం మండల టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ నెల 14వ తేదీన తాళ్లగొమ్మురు ఐటిసి ఫంక్షన్ హాల్లో విచ్చేయిచ్చున నేపథ్యంలో బూర్గంపాడు మండలంలోని టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు,వార్డుసభ్యులు,మాజీ ఎంపీటీసీలు,సొసైటీ డైరెక్టర్లు,కార్యకర్తలు,అనుబంధ సంస్ధలు మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అత్యధిక సంఖ్యలో పాల్గొని సభ ని విజయవంతం చేయాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి గులాబీ జెండాని ఎగువేయలని కోరారు.

అదేవిధంగా మండలంలోని ప్రతి యాబై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకి గాను ఒక ఇంచార్జ్ ను నియమించారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపీరెడ్డి రమణరెడ్డి,మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మాజీ ఎంపీపీ కైపు రోసిరెడ్డి,మండల టిఆర్ఎస్ నాయకులు మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి,పోడియం నరేందర్,బెల్లంకొండ రామారావు,స్థానిక టిఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షులు గోనెల నాని,బూర్గంపాడు మండల పరిధిలోని సర్పంచులు,ఉపసర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ కమిటీ అధ్యక్షలు, వార్డుసభ్యులు,సొసైటీ డైరెక్టర్లు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: