CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయస్థాయికి ఎంపికైన ఎక్సలెంట్ సైన్స్ నమోనా

Share it:

 


👉ఎక్సలెంట్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం వరుసగా ఇది మూడోసారి

మన్యం టీవీ, పినపాక:2020-21 సంవత్సరానికి గాను ఇన్స్పైర్ సైన్స్ లో భాగంగా వర్చువల్ ప్రాసెన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల్లాబయ్యారం ఎక్సలెంట్ పాఠశాల కు చెందిన  భాషా హై స్కూల్ విద్యార్థి ఎస్కే జునైద్ తయారు చేసిన నమూనా న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుని జాతీయస్థాయికి ఎంపికైన ఈ సందర్భంగా విద్యార్థి ఎస్కే జునైద్ మాట్లాడుతూ వర్షాకాలంలో భారీ వర్షాలకు రోడ్లు మునిగిపోయి మ్యాన్ హోల్ లో పడి చాలా మంది చనిపోతున్నారు దీనికి అరికట్టాలని నేను ఈ ప్రయత్నం చేశాను అన్నారు ప్రస్తుతం మ్యాన్ హోల్  పైన మూత గా సిమెంట్ బ్లాక్ ని  ఉపయోగిస్తున్నారు వర్షపు నీటిని తొలగించడానికి బ్లాక్ ని తొలగించినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి తాను తయారుచేసిన ఈ నమూనాలు మోడీ ఫైర్ మాన్ హోల్  పరికరాన్ని అమర్చాలి ఈ ప్రక్రియలో వర్షపు నీరు జాలి ద్వారా మ్యాన్ హోల్ లోకి వెళుతుంది నీటి బరువు కు పిస్టన్ యధావిధిగా కిందికి వస్తుంది ఇది పూర్తిగా నీరు వెళ్ళే మార్గాన్ని  ఏర్పరుస్తుంది ఇది నీటి బరువు ఆధారంగా ఆటోమేటిక్ గా పనిచేస్తోంది ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం లేకుండా రోడ్లపై నీరు ఆగకుండా మ్యాన్ హోల్ కి వెళ్తుంది తద్వారా మ్యాన్ హోల్  వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చు అని వివరించాడు దీనికయ్యే ఖర్చు కూడా తక్కువే దాదాపురూ. 3000 సరిపోతుందన్నారు .శనివారం పాఠశాల ఆవరణలో జరిగిన సన్మాన సభలో విద్యాసంస్థల కరస్పాండెంట్ ఎండీ యుషాఫ్ షరీఫ్, డైరెక్టర్లు ఎండీ ఖాదర్ ,ఎండీ యాకూబ్  షరీఫ్, నర్సారెడ్డి, నరేందర్,ఎండీ ఖాన్,లెనిన్, గైడ్ టీచర్  ఏ. సురేష్ , విజేతను అభినందించారు .

Share it:

TELANGANA

Post A Comment: