CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ లో లో విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్లు ఒక్కరోజు సమ్మె/ విధుల బహిష్కరణ

Share it:

  మన్యం టీవీ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం పరిధిలో ఒకరోజు దేశవ్యాప్త సమ్మె లేదా విధుల బహిష్కరణ పిలుపుమేరకు తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్లను విధుల బహిష్కరణ. దేశంలోని అన్ని కేంద్ర రాష్ట్ర విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు మరియు ఇంజినీర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్ర మరియు జాతీయ సంఘాలను సమన్వయ పరుస్తున్న జాతీయ విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్లు సమన్వయ కమిటీ (NCCOEEE), పిలుపుమేరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్లు,NCCOEEE తెలంగాణ తేదీ03-02-2021 బుధవారం రోజున విద్యుత్ ఉద్యోగులు అండ్ ఇంజనీర్లు విద్యుత్ రంగంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర విద్యుత్ సంస్థల లైన్,TSTRANSCO, TSGENCO, TSSPDCL1 మరియు TSNPDCL లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్లు అందరూ ఫిబ్రవరి 3వ తేదీన విధులు బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపసిందిగా పిలుపునిచ్చారు.

కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు 2020 బిల్లు ద్వారా గత 70 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధీనంలో లో పని చేస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థలు దేశంలోని 25 కోట్ల వినియోగదారులు, వ్యవసాయదారులు, పరిశ్రమ వర్గాలకు సరళమైన విద్యుత్తుని అందిస్తూ దేశ అభివృద్ధిలో భాగమైన విద్యుత్ సంస్థలను, ప్రభుత్వానికి మిత్రులుగా మెలుగుతున్న బడా కార్పొరేట్ సంస్థలకు, అప్పగించి ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యుత్ అనేది మన దేశంలో సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన కోణంలో కొనసాగుతున్న వ్యవస్థ అలాంటి వ్యవస్థను ఈ బిల్లు ద్వారా లాభార్జన తో పనిచేసే ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నాలను ఉద్యోగులందరూ ప్రతిఘటించాలి.

ఇప్పటికే విద్యుత్ రంగంలో అనేక సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగులకు మరియు వినియోగదారులకు జరుగుతున్న నష్టాన్ని చూశాం. మన రాష్ట్రంలో 70 వేల మంది విద్యుత్ ఉద్యోగులు మరియు సుమారు కోటి 90 లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై ప్రభావం పడుతుంది మరియు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువవుతుంది, ప్రమాదాలు పెరుగుతాయి, ప్రజలపై అధిక ఛార్జీలు భారం బారులు పడుతుంది.

ఉత్తరప్రదేశ లో లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు వీరోచితంగా పోరాడిన తీరుతో  అక్కడి ప్రభుత్వం దిగివచ్చి విద్యుత్ పంపిణీ వ్యవస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని జాతీయ విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్లు సమన్వయ కమిటీ(NCCOEEE) నిర్ణయించింది.

"" ప్రధాన డిమాండ్లు""

👉🏿 విద్యుత్ సవరణ బిల్లు 2020 మరియు విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ కొరకై రూపొందించిన స్టాండర్డ్ బిల్డింగ్ డాక్యుమెంట్ను ఉపసంహరించుకోవలి.

👉🏿 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ చర్యలు ఆపాలి మరియు కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే విద్యుత్ రంగంలో కొనసాగుతున్నారు ప్రైవేట్ విద్యుత్ లైసెన్స్/ ప్రాంఛైజీలు ను రద్దు చేయాలి.

👉🏿 కె ఎస్ ఈ బి(KSEB) లిమిటెడ్ మాదిరిగా రాష్ట్రాల్లోని అన్నీ జనరేటింగ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలి.

👉🏿 విద్యుత్ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఇ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.

👉🏿 కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అందరికీ పర్మినెంట్ చేయాలి.

👉🏿 విద్యుత్ సంస్థల్లో ఉన్న ఖాళీ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన వెంటనే భర్తీ చేయాలి.

భద్రాచలం డివిజన్ కార్యక్రమాల్లోUEEU-CITU0 జిల్లా అధ్యక్షులు కొలగని రమేష్, 327(INTUC) జిల్లా అధ్యక్షుడు బి రామకృష్ణ, ఆదినారాయణ,1104 యూనియన్ కే టి ఎన్ మూర్తి పాల్గొన్నారు.TRVKS యూనియన్ బి పెద్ద రాజు, కామేష్TSIEEU-CITU డివిజన్ అధ్యక్షులు ఉదయ రత్న కుమార్, దూడ శీను, నాగళ్ల రవి ,పి కృష్ణార్జున రావు, ఆర్ సందీప్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: