CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వరంగల్ కు చెందిన సేవా స్వచ్ఛంద ఆర్థిక సహాయం

Share it:

 



నూగూరు వెంకటాపురం


ఈ రోజు వరంగల్ అర్బన్ జిల్లాకి చెందిన సేవా స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, పాత్రపురం గ్రామనికి చెందిన సండ్ర ప్రభావతి ఆరోగ్య చికిత్స నిమిత్తం 11,500/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమనికి సంస్థ వ్యవస్థాపకుడు జూపాక రత్నప్రణయ్ అధ్యక్షతన వహించగా, ముఖ్య అతిధులుగా సామాజికవేత్త, ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగుల సురేందర్ మరియు గ్రేస్ హోమ్ నిర్వహకురాలు కారం రాధ విచ్చేసి ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.


ఈ సందర్భంగా పాలడుగుల సురేందర్ మాట్లాడుతూ సేవా స్వచ్చంధ సంస్థ వారు తెలంగాణలోని వివిధ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండడం శుభపరిణామం, ఈ రోజు కార్యక్రమనికి ఆర్థిక సహాయం అందించిన దాతలు అల్లం నాగరాజు రెడ్డి, ఎడ్ల ప్రమోద్, దొంతి అరవింద్ రెడ్డి, రావుల సుధాకర్ లకు ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో సేవా స్వచ్చంధ సంస్థ ప్రధాన కార్యదర్శి అయిత ఉషాభాస్కర్, కోశాధికారి జన్ను ప్రదీప్ మరియు స్థానికులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: