CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉వైద్య సిబ్బంది కనబడని శతృవుతో పోరాడుతూ మనలను కాపాడుతున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి తెలిపారు

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం:- ఫిబ్రవరి 6,

శనివారం నుండి రెవిన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్ సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్న ప్రక్రియలో భాగంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్ కొత్తగూడెం పట్టణంలోని సఫాయిబస్తీ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 16వ తేదీన జిల్లాలో ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషనన్ మొదటి దశ ప్రక్రియలో వైద్య, అంగన్వాడీ, పారిశుద్య కార్మికులకు విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచామని రెండవదశలో రెవిన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ సిబ్బందికి వాక్సిన్ ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలననుసరించి సిబ్బంది వివరాలను ఆన్లైన్ చేయగా తమకు ఈ కేంద్రం నందు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం వచ్చిందని చెప్పారు. దాదాపు సంవత్సరం కాలం తదుపరి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని ఇపుడు వ్యాధి గురించి బయపడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఈ రోజు వ్యాక్సిన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఏయన్యం విజయలక్ష్మి సునాయాసంగా ఏ మాత్రం నొప్పి లేకుండా వ్యాక్సిన్ చేశారని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు ఈ రోజు తనకు కోవాన్ వ్యాక్సిన్ ఇచ్చారని తదుపరి 28 రోజుల తరువాత రెండ డోస్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం దాదాపు 40 నిమిషాల పాటు ఆసుపత్రిలో విశ్ శరాంతి తీసుకున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఎన్నో పరీక్షలు నిర్వహణ తదుపరి ప్రభుత్వం వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు నుండి చేపట్టిన రెండవ దశ క్రింద వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలోని 38 వైద్య కేంద్రాల్లో చేపట్టామని దాదాపు 9 వేల మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రధమంగా కరోనా కేసులు నమోదైన సందర్భంలో జిల్లా వణికిపోయిందని, అటువంటి కష్టకాలంలో జిల్లాలో దాదాపు 72 రోజులు పాటు ఒక్క కేసుకూడా నమోదు కాకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టామని చెప్పారు. ఆనాటి పరిస్థితుల నుండి నేడు సురక్షిత పరిస్థితికి వచ్చామని సంతోషం వ్యక్తం చేశారు. ఫ్రంట్ లైన్ వర్కుర్లుగా గుర్తించిన వారందరికీ వ్యాక్సిన్ అందచేయనున్నామని తదుపరి 50 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు కొరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా వైధ్యాధికారిని ఆదేశించారు. డిప్యుటేషన్పై వెళ్లిన సిబ్బందిని తిరిగి రప్పించాల్సిందిగా ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కౌన్సిలర్ పోలోజు సత్యనారాయణచారి, జిల్లా వైద్యాధికారి భాస్కర్, ఆసుపత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరారావు, ఆసుపత్రి పర్యవేక్షకులు సరళ, వ్యాక్సినేషన్ ప్రత్యేక అధికారి నాగేంద్రప్రసాదు, కరోనా సర్వెలెన్సు అధికారి చేతన్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: