CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులు పొందిన ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలి

Share it:

 -తెలంగాణమాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి గొస్కుల రాంబాబు

మన్యం టీవీ మంగపేట. 

తెలంగాణ మాలమహానాడు ముఖ్య నాయకుల సమావేశం మగపేట మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్ ఆధ్వర్యంలో జరిగిన  సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి గొస్కుల రాంబాబుహాజరై మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  రిజర్వేషన్ పొందిన అధికారులపై రెడ్డి అహంకారంతో చులకనగా మాట్లాడిన తీరును రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులు పొందిన దళిత నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. స్పందించని పక్షంలో లో దళితులు గా చెప్పుకునే వారికి అర్హత  లేదన్నారు రాష్ట్రంలో దళిత జాతి మొత్తం నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్న స్పందించకపోవడం దళితుల పట్ల చిత్తశుద్ధి లేదా అని ప్రశ్నించారు. చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించాలని  కోరారు.  రాష్ట్రం నాశనానికి కారణం 35 శాతం మార్కులు వచ్చిన మేనేజ్మెంట్ ద్వారా ఉన్న సీట్ల అగ్రవర్ణాల అని అన్నారు. దోపిడీదారుల పాలనలో రిజర్వేషన్ పొందిన ఉద్యోగస్తులు వారి పనులను వారిని  చేయించుకోకుండా అడ్డుతగిలింది అగ్రవర్ణ నాయకులు కాదా అని మండిపడ్డారు. ఉదాహరణకు భూపాలపల్లి కలెక్టర్ గా పనిచేసిన ఆకునూరి మురళి ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం కావాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తే పనికిరాని శాఖకు బదిలీ చేసింది నిజం కాదా అని అన్నారు. అతను ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో విద్యా శాఖ డైరెక్టర్ గా చేయడం గర్వకారణమన్నారు. ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూపోతే దళితులు ఎన్నో సేవలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోయిన దాంట్లో ముందు వరుసలో ఉన్నారని అన్నారు. ఇలాంటి పనికిరాని చెత్త నాయకులు అధికారంలో ఉంటే ఏలా రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించారు. దోచుకోవడానికి అలవాటుపడ్డ  చాల్ల ధర్మారెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే మీరు ఎక్కడ ఉండే వాళ్ళు తెలుసుకోవాలన్నారు. ఈరోజు నువ్వు జీప్ డ్రైవర్ స్థాయి నుండి  బడా కాంట్రాక్టర్ గా ఒక ఎమ్మెల్యేగా ఎన్ని పార్టీలు మార్చినవో నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలని మండిపడ్డారు. నీవు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ పాదాలకు ముక్కు నేలకు రాసి  బహిరంగ క్షమాపణ చెప్పే దాకా  వదిలి పెట్టమని హెచ్చరిక చేశారు.  అలాగే తెరాస పార్టీ కూడా పార్టీ నుండి సభ్యత్వం రద్దు చేసి ఎమ్మెల్యే పదవిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేసారు.  ఈ సమావేశం లో జిల్లా కార్యదర్శి నిమ్మగడ్డ ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను ,జిల్లా నాయకులు మాదారి రాంబాబు బిలపాటి చిరంజీవి,జోగారావు కర్రీ చందు, లవకుమార్ తదితరులు పాల్గొన్నా.రు

Share it:

TELANGANA

Post A Comment: