CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డా :బీ ఆర్ అంబేద్కర్ ను అవమానించటం అంటే యావత్ దేశాన్ని అవమానించటమే

Share it:

 



మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్  విగ్రహానికి విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను  వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలి, లేదంటే ఇటువంటి రాక్షస ఆనందం పెట్రేగి యవత చెడు మార్గం పట్టే అవకాశం వుంది. భారత రాజ్యాంగం రాసిన డా:బీ ఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగింది అంటే యావత్ దేశాన్ని అవమానించినట్లు, భారత రాజ్యాంగంను అపహాస్యం చేసినట్లు, అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదువ్యవస్థ,  మహా శక్తి, అతను ఏ ఒక్క కులానికో మతానికో చెందిన వ్యక్తి గా పరిగణించుట తప్పు. అంబేద్కర్ అంటే అందరివాడు. ఒక్కటే దేశం, ఒక్కటే జాతి, ఒక్కటే రాజ్యాంగం అటువంటి సమగ్ర భారత దేశంలో అంబేద్కర్ ను అవమానించటం అంటే నిన్ను నువ్వు అవనించుకోవటమే.ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ను గౌరవిస్తుంటే మన దేశంలో మన దేవుడిలాంటి అంబేద్కర్ కు అవమానం జరగటం సహించరానివిషయం. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండ ప్రభుత్వం చర్యలు చేపట్టి దోషులకు కఠిన శిక్ష వేయాలని ఈ సందర్బంగా మంగపేట మండల అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలోములుగు జిల్లా సీనియర్ నాయకులు పగిడిపెల్లి వెంకటేశ్వర్లు, చిట్టిమల్ల సమ్మయ్య, వేంపల్లి సమ్మయ్య, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు, అంబేద్కర్ యువజన సంఘం సబ్ డివిజన్ అధ్యక్షులు కర్రి రామ్మోహన్, దీకొండ నరసింహారావు, ఉద్యమకారుడు ఎల్పీ ముత్యాలు, స్వేరో నాయకులు ఎంపెల్లి వీరాస్వామి బోడ ప్రవీణ్, కస్బా ముకుందం, దాసరి ఎల్లయ్య, జంగం భాను, గోమాసు లక్ష్మి నారాయణ, ఎంపెల్లి మల్లేష్, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: