CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉జిల్లాలో రేపటి నుంచి రైతు శిక్షణా కార్యక్రమాలు

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం

మండల కేంద్రాల్లోని రైతు వేడుకల్లో ఈ నెల 4వ తేదీన రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి తెలిపారు.  గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి వ్యవసాయ, ఉద్యాన, మత్య్స, పశుసంవర్ధక, బ్యాంకు,  రైతు సమన్వయ కమిటీ సభ్యులు, మహిళా సంఘాలతో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తుగా  మండల కేంద్రాల్లోని రైతు వేదికలల్లో తదుపరి క్లస్టర్ కేంద్రాల్లో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు వేదికలు వినియోగించు

కోవాలని చెప్పారు. అధిక దిగుబడి వచ్చే పంటల సాగు చేపట్టు విదంగా అవగాహన కల్పించాలని చెప్పారు.  రైతు బంధు, రైతు భీమా చెల్లింపులు, ఎరువుల వినియోగం, పచ్చి రొట్ట ఎరువులు వినియోగంపై బాగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ, రైతు బంధు, మహిళ సంఘాల సభ్యులు తీసుకోవాలని చెప్పారు.  క్లస్టర్ వారిగా పంటల సాగు వివరాలను క్రాప్ బుకింగ్ చేయాలని చెప్పారు.  శుక్రవారం వరకు క్రాప్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.  రైతులు పంట సాగుకు కావల్సిన రుణాలు మంజూరులో వెనుకంజలో ఉన్నామని కారణాలపై త్వరలో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించి సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.  బ్యాంకులు వారిగా వ్యవసాయ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు.  రబీలో 772 కోట్లు పంట రుణాలు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 270 కోట్లు మాత్రమే మంజూరు చేసారని ఎందుకు రుణాలు మంజూరులో జాప్యం జరుగుతున్నదని వ్యవసాయ, బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకున్నారు.  80 శాతం పంటలు సాగు చేయడం పూర్తి అయిందని కానీ నగదు అవసరమైన ఈ సమయంలో రైతన్నకు రుణాలు చెల్లింపు జాప్యం జరుగుతున్నదని ఇందుకు కారణాలను తదుపరి నిర్వహించే జిల్లా స్థాయి సమావేశంలో తెలియచేయాలని చెప్పారు.  పెట్టుబడికి సాయం అందించడానికి మనకు అవకాశం ఉన్న నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది 

పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు పరస్పరం సంయుక్తముగా రైతులకు పంట రుణాలు మంజూరుకు కృషి చేశారని చెప్పారు.  ఆళ్లపల్లి వ్యవసాయ అధికారి రుణాలు మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ షో కాజ్ జారీ చేయాలని ఆదేశించారు.  రైతు భీమా రెన్యూవల్ చేయించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని చెప్పారు.  రైతు భీమా పథకం  గురించి రైతులకు అవగాహన ఉండదని కాబట్టి అలసత్వం వహిస్తే తదుపరి జరిగే పరిణామాల వల్ల పాపం తగులుతుందని చెప్పారు. పంటల సాగుకు స్త్రీ నిధి రుణాలు ఉపయోగ పడే అవకాశం ఉంది కాబట్టి ఇట్టి రుణాలు మంజూరులో జాప్యం చేయొద్దని బ్యాంకర్లు కు, మహిళ సంఘాలకు సూచించారు.   

ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి మధుసూదన్ రాజు, వ్యవసాయ, ఉద్యాన, మత్య్స, మార్కెటింగ్, రైతు బంధు సభ్యులు  మండల  మహిళ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: