CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇండేన్ గ్యాస్ గోడం ప్రారంభం

Share it:

 


గుండాల మన్యం టీవీ: ఏజెన్సీ ప్రాంతంలో గ్యాస్ గోడౌన్ ఏర్పాటు కావడంతో కట్టెల పొయ్యితో స్థానిక ప్రజల కష్టాలు తొలగిపోయాయని జెడ్పిటిసి వాగబోయిన రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. గుండాల మండల కేంద్రంలోని జగ్గయిగూడెం క్రాస్ రోడ్ వద్ద శ్రీ బాలాజీ ఇండేన్ గ్యాస్ గోడౌన్ ను బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ప్రజలకు గ్యాస్ అవసరమైతే 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందు నుంచి రావలసిన పరిస్థితి ఉందన్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సమయాల్లో అధిక మొత్తం చెల్లించి కొనుగోలు చేసుకుంటున్నారని తెలిపారు. గౌడన్ ఏర్పాటుతో గ్యాస్ ఇక్కడ లభించడం శుభపరిణామం అన్నారు. డోర్ డెలివరీ చేస్తామని. ప్రత్యేక వాహనం ద్వారా గ్రామాలలో గ్యాస్ సిలిండర్లు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: