CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళితులకు అడుగడుగునా అన్యాయమే

Share it:


  *దళిత జాతికి మేలు చేయని ప్రభుత్వాలు.              *దళితుల ఎస్సీ కాంప్లెక్స్ భూమిని అగ్రవర్ణాల చేతుల్లోనే. *నోరు పెగలని నాయకులు న్యాయం కోసం దళితులు పడిగాపులు.


మన్యంటీవీ ఏటూరునాగారం:


 మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో దళితులకు అడుగడుగునా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఏండ్లు గడుస్తున్నా ఏటూరునాగారం దళితులకు న్యాయం చేయని ప్రభుత్వాలు. తరుచూ దళితులపై వేధింపులు అక్రమ కేసులు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. దళిత జాతి మేలు కోసం పోరాడనీ  దళిత ప్రజాప్రతినిధులకు పదవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ దళిత ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. దళితులు గ్రామీణ ప్రాంతాలలో దుర్భర జీవితాలు గడుపుతున్న దళితుల జీవనంపై నోరు పెగలని దళిత ప్రజాప్రతినిధులు నాయకులు రెక్కాడితే గాని డొక్క నిండని దుస్థితి చెమటోడుస్తున్న కష్టపడి జీవనాన్ని సాగిస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతం ఏటూరునాగారం దళితులు ఏటూర్ నాగారం మండల కేంద్రంలో దళితులకు ఎస్సీ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తేదీ 21/ 5 /1986 రోజున ప్రభుత్వ భూమిలో శంకుస్థాపన చేసి ఈ భూమి 1999 సంవత్సరం లో కడియం శ్రీహరి మంత్రి గారి ఆదేశాల మేరకు అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ సబ్ కలెక్టర్ నవీన్ మిట్టల్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు తాసిల్దారు గారు సర్వే చేయించి సర్వేనెంబర్ 376 / 2. విస్తీరణం 7:00 భూమి పి.సరళ నెంబర్ 376/ 4. విస్తీర్ణం ఒక గుంట భూమి మొత్తం ఎనిమిది గుంటలు భూమి 13 మంది నిరుపేద దళితులకు. ఆర్ సి నెంబర్.b/2552 ద్వారా భూమి పట్టా ఇవ్వడం జరిగింది. ఇట్టి భూమిలో ఎస్సీ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి పూర్వ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అజ్మీర చందూలాల్ గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి ఎస్సీ కాంప్లెక్స్ నిర్మాణం ఎస్టిమేట్ అంచనా వ్యయం రూ 35 పాయింట్ 10 లక్షలు ప్రపోజల్ అనుమతి పంపించడం జరిగింది. కానీ నిధులు మంజూరు కాలేదు దళితులకు ఇచ్చిన భూమిని అగ్రకులాల వారు అక్రమంగా కబ్జా చేసి వాటాలు పంచుకొని దళితులకు తీవ్ర అన్యాయం చేశారు.                         దళితుల భూమి వదలం నిరుపేదల దళితులకు చట్టబద్ధత హక్కుగా పట్టాలు ఇచ్చిన భూమిని అగ్రకులాల వారు అక్రమంగా ఆక్రమించుకుని వాటాలు పంచుకుంటున్నారని, తమ భూమిని వదిలిపెట్టేది లేదని చావనైనా చస్తాము గానీ తమ భూమిని వదలం కాపాడుకుంటాం అని  బాధిత కుటుంబాలు వాపోతున్నారు. దళితుల ఇబ్బందులు  మన్యంటీవీ పరిశీలించింది. వారి ఇబ్బందులు వేత్తలు కష్టాలు కన్నీళ్లు తెలుసుకుంది. గత కొన్ని ఏళ్లుగా నిరుపేద దళిత కుటుంబాలు తినీ తినక అర్థాకలితో జీవనాధారం గడుపుతూ తమ జీవనాధారమైన పట్టా భూమి కోసం ఎదురు చూస్తూ పోరాడుతూనే ఉన్నారు. దళితుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దళితులను భయబ్రాంతులకు గురి చేసి ఆర్థిక బలం రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దళితుల భూమి లాక్కోవడం జరిగిందని పలువురు దళిత కుటుంబాలు కంటతడి పెట్టారు. ఇది తమ పట్టా భూమి కోసం పోరాడుతూ అనారోగ్యంతో కొంత మంది దళితులు మరణించారని వారి కుటుంబాలు వీధిన పడ్డాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు తమ పట్టా భూమి లో అప్పట్లో నిర్మాణాలు చేసుకుంటుంటే అగ్రకులాల వారు అడ్డుకుని దళితులను అసభ్యకరంగా దూషిస్తూ భయబ్రాంతులకు గురి చేసి ఇబ్బంది పెట్టారు. అప్పట్లో కొంతమంది పై ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదయ్యాయి. దళితుల పట్టా భూమిని అక్రమంగా ఆక్రమించుకున, అగ్రకులాల వారి పై పలువురు చీ కొట్టడంతో కొంతమంది అట్టి భూమిని వదిలి వెళ్ళిపోయారు . ఇట్టి పట్టా భూమి పై తుది శ్వాస వరకు అంబేద్కర్ సంఘం జిల్లా నాయకుడు దుర్గం రామస్వామి పోరాటం చేసి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణానంతరం భూమిని వదిలి వెళ్ళిన అగ్రకులాలవారు భూమి పై పోరాటం చేసిన దుర్గం రామస్వామి మరణించారు. వీరి వద్ద ఎలాంటి కాగితాలు సాక్ష్యాధారాలు లేవని దళితుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కోర్టు తమకు భూమి పై హక్కు కల్పించింది. అంటూ తప్పుడు ప్రచారాలు చేసి మరల భూమి పైకి రంగప్రవేశం చేశారు. వారి ఆర్థిక రాజకీయ పలుకుబడి ఉపయోగించి అట్టి భూమిలో కొన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రశ్నించిన దళితులను భయబ్రాంతులకు గురి చేస్తూ మీకు ఎలాంటి హక్కు లేదు. భూమిపై హక్కు తమకు కోర్టు కల్పించబడింది. అంటూ మీకు దిక్కున్నచోట చెప్పుకోండి అంటు దళితులను మోసం చేశారు. దళితుల పట్టా భూమిని కబ్జా చేసిన వారు రెండు మూడు స్థలాలు ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టి కిరాయి లకు ఇచ్చి సొమ్ముచేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు . ఇట్టి భూమిలో ఒకరిద్దరు నిరుపేదలు చిరు వ్యాపారం పెట్టుకొని జీవనం గడుపుతున్నారు. వారి వద్ద నుండి లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  డబ్బులు ఇవ్వని వారిని వేధిస్తూ ఖాళీ చేయాలని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది ఇట్టి విషయం పోలీస్ స్టేషన్ల చుట్టూ బాధితులు తిరుగుతున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. దళితులకు పట్టాలు ఇచ్చి ఎస్సీ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం నేటికీ నిలువెత్తు సాక్ష్యం గా దర్శనమిస్తూనే ఉంది. ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో దళితులకు భూ పంపిణీ లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో దళితులకు ఏ విధమైన హక్కులు లేకుండా దుర్భర జీవితాలు గడుపుతున్నారని, పలువురు దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . నాన్ ఏజెన్సీ ప్రాంతంలో దళితులకు ఇచ్చిన భూమికి రక్షణ లేకుండా పోయింది. దళితుల భూమిని అధికార ఆర్థిక రాజకీయ అండదండలతో భూ కబ్జా చేసి దళితులకు అన్యాయం చేసి దళితుల భూమిని అప్పనంగా అనుభవిస్తున్నారు. గతంలో నిరుపేద దళితులు కొంతమంది దళితులకు భూ పంపిణీ పథకం కింద జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ భూమిని పోడు చేసుకొని పంట సాగు చేస్తున్న క్రమంలో అట్టి దళితుల భూమిని గ్రామ అవసరాలకు కేటాయించాలని కోరడంతో లక్షల రూపాయలు తినీ తినక చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బులు భూమి పై పెట్టుబడి పెట్టి భూమిని గ్రామ అవసరాల నిమిత్తం దళితులు అప్పగించడం జరిగింది. అప్పుడు సామాజిక మాధ్యమాలలో నోరు మెదిపిన నాయకులు ఇప్పుడు దళితులకు ఇచ్చిన పట్టా భూమి విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదని దళిత ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. దళితులకు అన్యాయం జరిగితే మాత్రం నోరు విప్పటం లేదు ఎందుకు. దళితులను విభజిస్తూ. పాలిస్తూ ఆర్థికంగా రాజకీయంగా ఎదగకుండా అణచివేసే ధోరణి అవలంభిస్తున్న ఉన్న దానికి ఇదే నిదర్శనమని పలువురు దళిత సంఘాల నాయకులు పేర్కొంటున్నారు . దళితులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చి  కేటాయించిన భూమిని అగ్రకులాల వారు లాక్కుంటే దళితులు ఎట్లా బతకాలి అని వాపోతున్నారు. దళితుల భూమి విషయంపై అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నప్పటికీ తమకు ఎవరు కూడా న్యాయం చేయలేదని దళితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ పట్టా భూమిని తమకు అప్పగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు . లేనిపక్షంలో దళితుల ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం అవుతారని అన్నారు. దళితులకు కేటాయించిన పట్టా భూమి కబ్జా చేయడం లో తెరవెనుక కొంతమంది తెరాస నాయకుల ప్రమేయం ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దళితులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని దళితుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని నాయకుల తీరుపై దళిత ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. దళితులకు చట్టబద్దంగా భూమికి పట్టా ఇచ్చిన కల్పించబడిన భూమి పై హక్కు అగ్రవర్ణ లకు ఏ విధంగా హక్కు సంక్రమించిందని చట్ట ప్రకారం కోర్టు వారికి భూమిపై ఏవిధంగా హక్కు కల్పిస్తుందని ప్రశ్నించారు. ఇటు దళితులను అటు కోర్టు చట్టాలను మోసం చేస్తున్న భూ కబ్జాదారుల పై చట్టప్రకారం చర్యలు తీసుకొని దళితుల భూమి దళితులకు అప్పగించాలని న్యాయం చేయాలని కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: