CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్రం తెచ్చిన 3 సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలి

Share it:

 




 మన్యంటీవీ,అశ్వారావుపేట:

  కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక సాగు చట్టాల రద్దుకై జాతీయ  రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా 6/2/2021న అశ్వారావుపేటలో కాకతీయగేట్ వద్ద రాస్తారోఖో చేయటంజరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐకెఏంఎస్ రాష్ట్ర నాయకులు గోకినేపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన 3 సాగు చట్టాలు భవిత వ్యవసాయరంగానికి ఉరితాళ్లులాగాను, అంబానీ, ఆదానిలకు పూల మాలలు గా మారాయనీ ఇది చాలా దుర్మార్గంగా తయారయిందని కేంద్ర తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించిన మోడీ మనసు మారడం లేదనీ 3 సాగు చట్టాలను రద్దు చేయకపోతే మోడీని గద్దె దించడం ఖాయమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యాక్రమం లో  వ్యవసాయ కార్మకసంఘం నాయకులు బి.చిరంజీవి, లక్షినారాయణ, శ్రీనివాసురావు, పి నాయుడు, రైతు సంఘంనాయకులు ఎస్డి  సలీంజి, రామకృష్ణ, సంఘం  కృష్జమూర్తి, టిజేయస్ నాయకులు నభీ, శరత్ భాబు, వరలక్షి, అర్జన్ తధితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: