CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 పోడు భూములను దౌర్జన్యంగా లాక్కుంటే సహించేది లేదు

Share it:


* పోడు రైతులకు అండగా ఉంటాం

* ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా పిలుపుతో భారీగా కదిలిన టిఆర్ఎస్  శ్రేణులు

* యంత్రాలను వెనక్కి పంపిన రైతులు


గుండాల మన్యం టీవీ: పోడు భూములపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకూ ఫారెస్ట్ అధికారులు గిరిజన రైతుల  పోడు భూములను దౌర్జన్యంగా లాక్కుంటే సహించేది లేదని మణుగూరు జెడ్పిటిసి పోశం నరసింహారావు, పినపాక  ఎంపీపీ  గుమ్మడి  గాంధీ,  గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ఆళ్లపల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, ఆళ్లపల్లి జడ్పీటీసీ కొమరం హనుమంతరావు అన్నారు.  శంభుని గూడెం గ్రామంలో పోడు భూముల్లో ట్రంచ్ తీసేందుకు  వచ్చిన ఫారెస్ట్, పోలీసు అధికారులతో వాగ్వివాదం జరిగిన సంఘటన విధితమే కాగా శనివారం ఆదివాసీలు ఐక్యమై పోడు పై తిరుగుబాటు చేయాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపుతో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో  ఆ గ్రామానికి చేరుకున్నారు. శుక్రవారం జరిగిన సంఘటనపై గ్రామ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోడు భూములకు  పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, పట్టాలు వచ్చేవరకూ పోడు భూముల జోలికి వెళ్లొద్దని రేగా కాంతారావు చెప్తున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు, పోలీసు బలగాలతో గ్రామాలకు వచ్చి యంత్రాలతో కందకాలు తవ్వడం సరికాదన్నారు.  కాచనపల్లి ఎస్ఐ శ్రీధర్ సమస్యను పరిష్కరించకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. పోడు భూముల విషయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటీఆర్ లతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. కొంతమంది ఫారెస్ట్ అధికారులు కావాలనే గిరిజన ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, గిరిజన గ్రామాల్లో ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని అన్నారు. త్వరలోనే పోడు భూములకు పట్టాలు వస్తాయని. పట్టాలు వచ్చేవరకు తాము పోడు పోరు లో రైతులకు అండగా ఉంటామని తెలిపారు. పోడు పట్టాల వచ్చేవరకు ఎక్కడ ఫారెస్ట్ అధికారులు భూములు లాక్కోవాలని ప్రయత్నించినా గిరిజనులంతా ఏకమై ఒక్క తాటిగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మణుగూరు పిఏసీఎస్ అధ్యక్షులు కొర్రి నాగేశ్వరరావు, గుండాల పీఏసీఎస్ అధ్యక్షులు గొగ్యల రామయ్య, పినపాక  పీఏసీఎస్ అధ్యక్షులు రవివర్మ, మణుగూరు, ఆళ్లపల్లి, పినపాక, కరకగూడెం మండలాల టిఆర్ఎస్ అధ్యక్షులు ముత్యం బాబు, పాయం నరసింహారావు, పగడాల సతీష్ రెడ్డి, రావుల సోమయ్య, గుండాల మండలం నాయకులు మోకాళ్ల వీరస్వామి, టిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మట్టపల్లి సాగర్, మణుగూరు టౌన్ ప్రెసిడెంట్ అడపా అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, జానంపేట ఎంపీటీసీ హరీష్, ఆత్మ కమిటీ డివిజన్ అధ్యక్షులు భద్రయ్య, టిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ జిల్లా కార్యదర్శి ఎండి ఆదాం,  గుండాల యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు,  నియోజకవర్గ నాయకులు బక్క వెంకట్ రెడ్డి, బోశెట్టి రవి ప్రసాద్, గుర్రం సుజన్, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, రేగా సత్యనారాయణ, కొంపల్లి రామలింగం, కుంజ వసంతరావు, పాయం నరసింహారావు, కొమరం విశ్వనాథం, వట్టం రవి, సుధాకర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: