CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉కోవిడ్ 19 యుద్ధ వీరుడు ఆత్మీయ సమ్మేళనం

Share it:


👉కరోనా వ్యాప్తి అత్యంత భయానకమైన రోజుల నుండి ప్రజలు సురక్షితంగా ఉండే స్థాయికి తీసుకురావడంలో వైద్య సిబ్బంది

సేవలు ఎంతో ప్రశంశనీయమని

 జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వీ.రెడ్డి తెలిపారు.


మన్యం టీవీ ,కొత్తగూడెం ప్రతినిధి:

 కొత్తగూడెం క్లల్ వైద్య శాఖ

ఆధ్వర్యంలో  డాక్టర్ నరేష్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ తల్లిదండ్రులు

ధర్మరాజు, పద్మజ్యోతి, భార్య పావని, కూతుళ్లు సంజని, తరణి, తమ్ముడు కిరణ్ లను ఘనంగా సత్కరించి 12 లక్షల రూపాయలు

ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్ధత, అంకితభావం కలిగిన యువ వైద్యుడు నరేష్ అని

కొనియాడారు. మణుగూరులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తూ విశిష్ట సేవలు అందించారని ఆ

క్రమంలేనే కరోన వ్యాధి బారిన పడి ఆగస్టు 7న మరణించారని చెప్పారు. అశ్వాపురంలో కరోనా కేసు నమోదు కావడం ఆ తదుపరి మరి మూడు

కేసులు కొత్తగూడెంలో నమోదు కాగానే భద్రాద్రి జిల్లా వణికిపోయిందని ఆ పరిస్థితి నుండి వీరోచితంగా పోరాడి అన్ని అవాంతరాలను

అధిగమించి నేడు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుని రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచామని చెప్పారు.

వైద్య సిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందించుటలో కీలకమైన పాత్ర పోషించారని చెప్పారు. ప్రజలను వ్యాధుల నుండి

రక్షించుటలో దేశ సైనికుల్లా సేవలందిచారని చెప్పారు. ఆ రోజుల్లో అన్ని శాఖల సమన్వయంతో రేయింబవళ్లు నిరంతరాయంగా

కృషి చేశారని ఆ పోరాడిన విధానం ఒక చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు

నిర్వహించిన జిల్లాగా మన జిల్లా 30 శాతంలో ప్రథమస్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఈ సీజన్లో మన్యంలో ప్రజలు జ్వరాల

బారిన పడి వైద్యం పడకేసిన రోజుల నుండి తగ్గించుకున్నామంటే అది కేవలం వైద్య సిబ్బంది కృషి వల్లనేనని చెప్పారు. కరోనా వ్యాప్తి

రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రులు మూతపడినప్పటికి ధైర్యంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రజలకు సేవలందించారని కొనియాడారు.

జిల్లాలో కార్పోరేట్ సేవలు అందుబాటులో లేవని ఆరోగ్యం అతి ముఖ్యమైనదని భావించి ఆరోగ్యానికి పెద్ద పీట వేశామని చెప్పారు.

డాక్టర్ నరేష్ పేద కుంటుంబంలో పుట్టి వైద్య వృత్తిని అభ్యసించి మన్యం ప్రజలకు వైద్య సేవలందించుటలో వీరమరణం పొందారని

ఆయన సేవలు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని, అతను అమరుడని జిల్లా నుండి రాష్ట్రస్థాయి వరకు అతని సేవలు

చిరస్థాయిగా నిలిచిపోయాయని చెప్పారు. ప్రజా సేవలో జీవితాన్ని త్యాగం చేసిన వైద్యుని భార్య పావనికి గెజిటెడ్ హెూదా కలిగిన

ఉద్యోగ అవకాశం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంతో పాటు వైద్య శాఖ ఒక మంచి

అంకితభావం కలిగిన వైద్యుడిని కోల్పోయిందని చెప్పారు. నరేష్ కుటుంబం మన వైద్య సిబ్బంది కుటుంబమని వారికి ఎప్పుడూ

తమ సహాయ సహకారాలుంటాయని చెప్పారు. గత ఆరు నెలల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో లేదని ప్రభుత్వం

తసుకున్న చర్యలు వల్ల మనం ఈ రోజు సురక్షితస్థాయికి చేరుకున్నామని చెప్పారు. కోవిడ్ నియంత్రణలో మన రాష్ట్రం రోల్ మోడల్ గా

నిలిచిందని చెప్పారు. భద్రం... భద్రాద్రి అనే స్లోగన్ తో జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి చేపట్టిన రక్షణ చర్యలు వల్ల వ్యాక్సినేషన్

ప్రక్రియలో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ ను అభినందించారు. డాక్టర్ నరేష్ భార్యకు గెజిటెడ్ ఉద్యోగ

అవకాశం కల్పించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ వ్యాధి వల్ల 40 మంది వైద్య సిబ్బంది మరణింగా 30

మందికి 15 కోట్లు ఆర్థిక సాయం అందించామని మిగిలిన 10 మందికి 5 కోట్టు ఆర్ధిక సహాయం అందించు ప్రక్రియ జరుగుతున్నట్లు

చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుండి ఫ్రంట్ లైన్ వర్కర్లుకు కోవిడ్ వ్యాక్సినేషన్ వేయు ప్రక్రియ ప్రారంభించనున్నామని మార్చి మాసం

నుండి 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ వేయుటకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కత్తి జనార్దన్, కార్యదర్శి పూర్ణచందర్‌రావు,

జిల్లా వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ నాయక్, డిసిహెచ్ఎస్ ముక్కంటేశ్వరావు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ చేతన్, ఉప వైద్యాధికారులు

వినోద్, బామ్ సింగ్, శ్రీనివాసరావు, వెంకటేశ్వరావు, పలువురు వైద్యులు, పారామెడికల్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ తదితరులు

పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: