CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Share it:


👉అన్ని రంగాల్లో  జిల్లా ప్రగతి

👉ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు


మన్యం టీవీ కొత్తగూడెం ప్రతినిధి


జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని ఎంతోమంది త్యాగధనుల ఫలితంగా త్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం వి రెడ్డి అన్నారు మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని ప్రగతి మైదానం లో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ అభివృద్ధి పథకాలతోపాటు ధరణి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టులు జిల్లా రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ధరణి ప్రాజెక్టు వలన ప్రత్యేక రైళ్లు ఏర్పాటు ద్వారా కోర్టులో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం లభించాయని తెలిపారు వృధాగా పోతున్న గోదావరి నీటితో బీడు భూములకు సాగునీరు అందించేందుకు 13000 58 కోట్లతో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తయ్యాయని తెలిపారు అశ్వాపురం మండలం అమ్మ గారి పల్లి వద్ద గోదావరి నదిపై రెండు వేల 712 కోట్లతో నిర్మించనున్న సీతమ్మ  సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని 2000 రెండు లక్షల 19వేల 773 గృహాలకు అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మొదటి దశలో కోవిడ్ వ్యాక్సిన్ 66 70 మంది కీ ఇచ్చినట్టు తెలిపారు కరోనా విధినిర్వహణలో డాక్టర్ నరేష్ మరణించడం దురదృష్టకరమన్నారు వ్యవసాయ రైతు వేదికలు ఉద్యానశాఖ సంవర్ధక శాఖ మార్కెటింగ్ మత్స్య శాఖ ద్వారా రైతులకు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని వివరించారు జిల్లాలోని 1649 పాఠశాలలో ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి మంది విద్యార్థులు చేస్తున్నారని ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి తొమ్మిది పది ఆపై తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు నిరుద్యోగ యువతకు షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బీసీ కార్పొరేషన్ మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ఉపకార వేతనాలు రుణాల మంజూరు తదితర కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ యువతకు చేయూత కల్పించిన విషయాన్ని తెలిపారు పేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహానికి స్పందిస్తున్న కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వారి జీవితాల్లో వెలుగు నింపుతూ ఉన్నాయన్నారు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం పనులు త్వరలో పూర్తి కానున్నట్టు తెలిపారు సుమారు 60 కోట్ల వ్యయంతో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ అధికారుల నివాసగృహాల పనులు చురుగ్గా సాగుతున్నాయని మార్చి చివరి నాటికి పూర్తవుతుందని స్పష్టంచేశారు మారుమూల గ్రామాల నిరుపేదలు అధికంగా నివసిస్తున్న ఆదివాసి జిల్లా కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఫలాలు వారికి అందే విధంగా అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు అనునిత్యం ప్రజల కోసం పని చేస్తున్న అధికారులను ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలతో సత్కరించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన దేశభక్తి నృత్యాలు అందరిని అలరించాయి ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ లో వారి ప్రత్యేకతను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అనుదీప్ కర్నాటి వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఓ ఎస్ డి తిరుపతి  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: