CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ ఆఫీస్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

Share it:

 


మన్యం టీవీ, భద్రాద్రి కొత్తగూడెం:

జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపిఎస్ ఈ ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా పేపర్ వినియోగాన్ని తగ్గించి పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది , అధికారులకు సూచించారు. ఈ పద్ధతి ద్వారా జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తమ అభ్యర్థనలను మొబైల్ ఫోన్ ద్వారా జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించవచ్చని తెలియజేశారు.జిల్లా పోలీసు కార్యాలయంలో జవాబుదారీతనం మరియు పారదర్శకతను పెంపొందించడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేసారు.అదేవిధంగా అధికారులు మరియు సిబ్బంది సెలవులు మరియు ఇతర అభ్యర్ధనల కొరకు కూడా ఆన్లైన్ ద్వారా అర్జీ పెట్టుకొని సులువుగా పొందవచ్చని తెలియజేశారు. ఈ ప్రక్రియ అమలు విధానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది మరియు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో వెంకటేశ్వర్లు, ఎస్బిఐ ఇన్స్పెక్టర్లు బాలాజీ,రవి మరియు జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: