CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పత్రికా ప్రకటన

Share it:

 


ఈరోజు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా డైరీ, అర్బన్ క్యాలెండర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్, ను ఆర్థిక శాఖమాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ కార్యదర్శి ప్రతాప్ గార్ల చేతుల మీదుగా ఈరోజు మంత్రి గారి నివాసం కొండాపూర్ లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా డైరీని ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో డైరీ  సభలు కీలక పాత్ర వహించాయని తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చాయని తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ అభివృద్ధికి దిక్సూచిగా ఉన్నాయ్ అని కొనియాడారు, తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి  తెలంగాణ ను అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంచుతున్నారని అలాగే సిద్దిపేట జిల్లా ఉద్యోగులు అందరూ  కష్టపడి పని చేసి సిద్దిపేట జిల్లా కు మంచి పేరు తీసుకు వస్తున్నారని తెలంగాణలో అన్ని రాష్ట్రాలలో సిద్దిపేట జిల్లా ఉద్యోగులు రోల్ మోడల్ గా నిలిచారని సంతోషాన్ని వ్యక్తం చేశారు డైరీ ఆవిష్కరణ సందర్భంగా సిద్దిపేట జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు పరమేశ్వర్ గారికి కార్యదర్శి విక్రమ్ రెడ్డి లకు వారి కార్యవర్గనికి  అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా బాగా పనిచేసి సిద్దిపేట జిల్లా కు మంచి పేరు తీసుకొని వచ్చి భారత దేశంలోనే అగ్రగామిగా ఉంచాలని సూచించారు, రాష్ట్ర ప్రభుత్వ ఏ పథకాలు ప్రవేశపెట్టిన వాటిని అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అందేలా సద్వినియోగం చేసే బాధ్యత మీపై ఉంది అని తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం అవలంబిస్తున్న పథకాలను ప్రజలకు అందజేయడంలో ముఖ్యపాత్ర ఉద్యోగులు పోషిస్తున్నారని కొనియాడారు త్వరలో ఉద్యోగుల సమస్యలు తొలగిపోతాయని ప్రమోషన్లు కూడా డిపార్ట్మెంట్ల వారీగా ఇవ్వడం కూడా జరుగుతుందని తెలిపారు.

టి న్ జి ఓ స్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో టి న్ జి ఓ స్ డైరీ ఆవిష్కరణలు తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ప్రజలకు ఉద్యమ కేంద్రాలుగా ఉండేవి అని ఇప్పుడు అవి తెలంగాణ బంగారు భవిష్యత్ కేంద్రాలు అవుతున్నాయి అని రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు గారికి టి న్ జి ఓ స్     సంఘము పట్ల సంఘ నాయకుల పట్ల ప్రేమ అభిమానులు ఉంటాయి అని. టి న్ జి ఓ స్ సిద్దిపేట జిల్లా డైరీ ఆవిష్కరణ పట్ల జిల్లా అధ్యక్ష,కార్యదర్శి పరమేశ్వర్,విక్రంరెడ్డి జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు తీయజేస్తూ భవిష్యత్ లో సిద్దిపేట జిల్లా ఉద్యోగులు  ఇంకా బాగా పని చేసి సిద్దిపేట ను అన్ని జిల్లా లకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్ మాట్లాడుతూ ముందుగా సిద్దిపేట జిల్లా అధ్యక్ష,కార్యదర్శులకు జిల్లా కార్యవర్గాన్ని డైరీ కి కష్ట పడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము సిద్దిపేట జిల్లా టి న్ జి ఓ స్  డైరీ మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి మన పట్ల,సంఘము పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుoది అని తెలిపారు, ఈ కార్యక్రమంలో సిద్దిపేట టి న్ జి ఓ స్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్,కార్యదర్శి విక్రమ్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిములు,  కోశాధికారి అశ్ప్యాక్ అహ్మద్,రాజశేఖర్ వర్మ,నగేష్, కృష్ణమూర్తి,శివనందం,జాబినా సుల్తాన్, నాగభూషణం, అర్బన్ అధ్యక్షుడు శశిధర్, కార్యదర్శి పోతుల సత్యనారాయణ, రురల్ కార్యదర్శి పవన్  కుమార్, గజ్వెల్ అధ్యక్షుడు లింగం కార్యదర్శి శ్రీధర్,ములుగు అధ్యక్షుడు శ్రీనివాస్,కార్యదర్శి భాస్కర్,హుస్నాబాద్ అధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి రాములు, దుబ్బాక అధ్యక్షుడు రఘురామ కృష్ణ,హాస్టల్ వెల్ఫేర్ అధ్యక్షుడు వెంకట రమణ రెడ్డి,కార్యదర్శి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి నరేష్, అబ్దుల్ ఖదీర్, సుమన్ , మల్లేశం, శ్యామసుందర్ రెడ్డి,రాజు, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: