CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జంగో లింగో దీక్ష

Share it:

 



మన్యం టీవీ, ఉట్నూరు :


 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనూరు మండలం లో జంగో లింగో దీక్ష మొదలైంది. కుంరం బాగవంత్ రావు అధ్యక్షతన అనేక మంది మేధావులు, గోడం రామారావు,మాజీ మంత్రి, సిడం అర్జు మాజీ ఐటీడీఏ చైర్మన్, కుస్రం హన్మంతరావు కిసాన్ మహరాజ్ మొదలగు వారు సమావేశం అయి  గోండు కోయ వారు ఖచరగఢ్ గుహలో శంభు మహాదేవుడు బందిచాడు.పరెండే ఖడ కోయ దేవుళ్లను గుహ నుంచి విముక్తి చేసి, వారికి జ్ఞాన బోధ చేసి, సగ, గోత్ర పెళ్లి సంబంధాలు, పుట్టుక,కర్మ కండలు మొదలగునవి తయారు చేశారు.కనుక గోండి ధర్మ గురువులుగా పేర్కొంటారు.ప్రాచీన కాలంలో గోండులను  ఉద్ధరించారు.కనుక జంగో లింగో దీక్షతో ఆరోగ్య ఐశ్వర్యం మొదలగునవి కలుగుతాయి అనే విశ్వాసంతో దీక్ష మొదలైనది.అనేక వేల మంది దీక్ష స్వీకరించి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినారు. అనేక సమస్యలు పరిష్కరించబడినవి.ఇలా దీక్షతో అనేక మందితో నేడు వారి మొఖలో ఆనందం కనిపిస్తుంది. పుష్య మాసంలో నెల అంత నెలపై పడుకుంటారు. మద్యం మాసం నిషేధం. సొంతంగా వంట చేసుకొని భుజిస్తారు. రాత్రి తెల్ల వారు జామున నిద్ర లేచి కాలకృత్యాలు,స్నానాలు చేసి పూజలు చేస్తారు.ఒంటి పూట భోజనం చేస్తారు.ఉపవాసం ఉంటారు.కొందరు నిరంకార్ అంటే కొన్ని రోజులు లేదా నెల రోజులు ఆహారం ముట్టుకోరు. జంగుబాయి గుహలు కప్లై,సిద్దికస,గొంది, మొదలు గుహలు పవిత్ర దేవస్థానాలు ఉన్నాయి.నెల రోజుల దీక్ష పుష్య మాసంలో చంద్రుడు నెల వంక చూసి దీక్ష స్వకరిస్తారు. ఈ సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. జంగావ్ గ్రామము లో మొదట హన్మంతరావు మహరాజ్ చేత దీక్ష స్వీకరించే వారు ఆయన మరణం తర్వాత కిషన్ మహరాజ్ దీక్ష  ఇస్తారు. పవిత్ర కప్లై గుహలో స్నానాలు చేసి మహపూజ పుష్య మాసం పౌర్ణమి రోజున సిద్ది కస లో మహా పూజ చేస్తారు.ఈ సంవత్సరం జనవరి 28 రోజున దీక్ష గురు కుంరం బాగవంత్ రావు మరియు కిషన్ మహరాజ్ అద్వారంలో మహా పూజ శంభు మహాదేవునికి అభిషేకం చేశారు. నైవేద్యం సమర్పించారు. అనేక వేల మంది జంగో లింగో దీక్ష దారులు సిద్దికసలో ఒక రోజు ముందు నుంచి జంగావ్,దొంగర్ గావ్ మొదలగు గ్రామాల నుంచి దీక్షాధారులు పాదయాత్ర చేసి రాత్రి భోజనాలు చేశారు. రాత్రి మూడు గంటలకు పవిత్ర గుహ కప్లై దర్శించి స్నానాలు చేసి పూజలు చేశారు. గుహ కిలోమీటర్ వరకు వెళ్తే పవిత్ర జలము ఉంటుంది. ఎంతో మహిమ గల జలముగా పెర్కొని జలమును తీసుకొచ్చి పంట పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయి.ఇలా జంగో లింగో ఘన సంస్థాన్ అధ్యక్షులు ఆత్రం రఘునాథ్, పెంధోర్ అర్జున్,కిసాన్ మహరాజ్,మ డవి రాజేశ్వర్,షేకు,పెంధోర ప్రభాకర్ న్యాయవాది, పెంధోర పుష్పరాని ఆదివాసీ మహిళ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, మంగం విషంరావు, పుర్క బాపురావు, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప నగేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేకవేల మంది భక్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: