CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అట్టహాసంగా ప్రారంభమైన ఆదివాసీ హక్కులు, చట్టాలు, సంసృతి చట్టాల పై అవగాహన సదస్సు

Share it:

 


👉జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన విప్ రేగా కాంతారావు, జెడ్పీ చైర్మన్  కోరం కనకయ్య

👉ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు జాడి ముసలయ్య, రామయ్య

మన్యం టీవి, పినపాక:భద్రాద్రి కొత్తగూడెంజిల్లా పినపాక మండలం ఐ లాపురం లోని మినిగురులం లో  పినపాక మండల ఆదివాసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో  ఆదివాసీ హక్కులు, చట్టాలు, సంసృతి చట్టాల పై అవగాహన సదస్సుఅట్టహాసంగా ప్రారంభమైనది.తొలుత పినపాకమండల  ,ఎంపీపీలు గుమ్మడి గాంధీ,రేగా కాళిక లు ,ఆదివాసీ ఉద్యోగుల సంసృతి క సంఘం మణుగూరు డివిజన్ అధ్యక్షులు పోలేబోయిన అనిల్ కుమార్,ఐక్యవేదిక నాయకులు తోలెం శ్రీను,అశోక్ లు ముఖ్య అతిధులు విప్ రేగా కాంతారావు,  జెడ్పీ చైర్మన్  కోరం కనకయ్య,ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు జాడి ముసలయ్య, రామయ్య లకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీ వీరుడు కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ముఖ్య అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

*ఆదివాసీల బతుకు  గడ్డు పరిస్థితి లో ఉంది:జడ్పీ చైర్మన్  కోరం కనకయ్య*

అడవి పై సర్వ హక్కులు ఉన్న నానాటికి ఆదివాసీ ల బతుకులు ఆగమవుతున్నాయని జడ్పీ చైర్మన్  కోరం కనకయ్య ఆవేదన వ్యక్తం చేసారు. చట్టాలు కాపాడుకోలేని ధీన స్థితిలో ఆదివాసుల ఉన్నారని ఆయన అన్నారు.ఆదివాసుల బాధలను బయటి ప్రపంచానికే వినిపిస్తున్న బలమైన నాయకుడు విప్ రేగా కాంతారావు అన్నారు.ఆదివాసీ హక్కులు, చట్టాలపై ప్రతి ఆదివాసీ యువత అవగాహన కలిగి ఉండాలన్నారు.

భారత దేశంలో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్ధకం:విప్ రేగా కాంతారావు

భారత దేశంలో నానాటికి ఆదివాసుల మనుగడ ప్రశ్నార్ధకం మారిందని విప్ రేగా కాంతారావు ఆవేదన వెలిబుచ్చారు.ఆదివాసీ బిడ్డలకు ఓపిక లేకుంటే భవిష్యత్తు అంధకారంగా ఉంది అని అన్నారు.జాతిని చైతన్యం చేయాల్సి బాధ్యత ప్రతి ఆదివాసీ బిడ్డ పై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తుడుండెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్,గొంది వెంకటేశ్వర్లు,మాడ వి  నెహ్రూ, ఇర్పా రామనాథం, కలివేటి భ్రమయ్య, చీమల నరసింహారావు,చందా హానుమంత్, ఉమ్మల దుర్గా రెడ్డి,కుంజా చిన్న అబ్బాయి, సోయం కన్న రాజు,ఆదివాసీకళ బృందం నాయకులు సిదేళ్ల హుస్సేన్, ఆదివాసీ ప్రజా ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: