CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ పట్టాలు రద్దు చేయాలి. మరియు క్రయ విక్రయ భూమి హక్కు పత్రాలను రద్దు చేయాలి ఆదివాసీ సంక్షేమ పరిషత్

Share it:

   మన్యంటీవీ ములుగు/ఏటూరునాగారం:


ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. తదనంతరం జరిగిన సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పర్శీక సతీష్  మాట్లాడుతూ 5వ  షెడ్యూల్ ఫామ్ ప్రాంతంలో ఆదివాసుల పక్షాన పని చేయాల్సిన అధికారులు గిరిజనేతరులకు   కొమ్ము కాస్తున్నారని అన్నారు.  ఆదివాసుల కోసం పోరాడే ఆదివాసి నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని  ఆయన అన్నారు.  ప్రభుత్వం తక్షణమే  స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కన్వీనర్ పులిశ నర్సింహారావు  మాట్లాడుతూ  వెంకటాపురం మండల కేంద్రంలో బందగూడెం (జి)లో  దానవయ పేట, లక్ష్మి నగరం  గ్రామస్తులకు1986సం లో  గోదావరి ముప్పు గ్రామాలుగా గుర్తించి సర్వే నెంబర్ 1,2,3,8,9  గల భూమిని  రెండు గ్రామాల ఆదివాసులకు ఇవ్వడం జరిగింది. అట్టి భూమిపై రెవెన్యూ యంత్రాంగం పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా  నిజంగా సాగులో ఉన్న నిజమైన ఆదివాసులకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు.

 ఏజెన్సీ ప్రాంతంలో1/70చట్టం, పేసా,   ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం అమలు చేయకుండా చట్టవిరుద్ధంగా బహుళ అంతస్తులు కట్టు తున్న, గిరిజనేతరుల ముడుపులను ఏజెన్సీచట్టాలను  దుర్వినియోగం చేస్తున్న అధికారులపై  కేసులునమోదు చేయాలని అని  డిమాండ్ చేశారు. 

ఈ  సమావేశంలో  ములుగు జిల్లా అధ్యక్షులు కోర్నేబెల్లి నాగేశ్వరరావు, చేల ఆనందరావు, తురస చంటి, కుర్సం నాగయ్య, ధర్మరాజు, కుర్సం చిన్నక్క,  శ్యామల దుర్గ, కుర్సం నాగమణి,కుర్సం చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: