CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంబేద్కర్ ఆశయ సాధకుడు గోనె తిరుపతి సంతాప సభలో పొదెం వీరయ్య

Share it:

 


మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలం తిమ్మంపేట లో అంబేద్కర్ ఆశయసాధకుడి సంతాప సభలో కుల మతాల రాజకీయాలకు అతీతంగా సబ్బండ వర్ణాలు పాల్గొని గోనె తిరుపతి సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ గోనె తిరుపతి చిన్న వయసునుండి  అంబేద్కర్ భావజాలం కలిగిన వ్యక్తి తన జాతి సామాజిక, రాజకీయ రంగాలలో ముందుండాలని కలలు కన్నా వ్యక్తి, ఎంపీటీసీ గా సర్పంచ్ గా తిమ్మంపేట కు సేవలందించారు.  అంబేద్కర్ ఆశయాలను, భావజాలం ప్రజల్లోకి  తీసుకోనివెళ్లి తద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసి గ్రామ గ్రామాన అంబేద్కర్, జ్యోతి రావుపూలే విగ్రహాలు పెట్టి కొలవాలని కలలుకనిన వ్యక్తి, తన మిత్రుల, సహచరుల సహాయంతో గూడెం గూడెం కు, గుడిసెకు అంబేద్కర్ భావజాలం తీసుకవెళ్లి యువత ను చైతన్య పరిచిన గోనె తిరుపతి మనతో ఇప్పుడు లేక పోయిన అతనువదలి వెళ్లిన మంచి, మానవత్వం మనల్ని ముందు ఉండి నడిపిస్తాయని, చిన్న వయసులో ఇలా జరుగుతుంది అని ఊహించలేదు అని పొదెం వీరయ్య గోనె తిరుపతిని యాది చేసుకొని అతని ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ పూలతో నివాళులు అర్పించారు.గోనె తిరుపతి సంతాప సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, దళిత, గిరిజన, బహుజన సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్వేరో నాయకులు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదటినుండి ముందు పడి అన్ని తానై నడిపించిన వ్యక్తులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు మిత్రుడిని కోల్పోయిన అతని ఆశయాలు మేము ముందుకు తీసుకువెళ్తామనిఈ సందర్బంగా తెలియజేసారు. సభను ఆద్యంతం ఆసక్తి కరంగా, సమన్వయపరుస్తూ, అతిధులను ఆహ్వానిస్తు,  ఎల్పీ ముత్యాలు, ఎంపెల్లి వీరాస్వామి,సభా మర్యాదలు పాటిస్తూ అతిధులకుఎటువంటి లోటు రాకుండ, కరోనా నియమాలు పాటిస్తూ గోనెతిరుపతి సంతాప సభను విజయవంతంగా నడిపించారు.

Share it:

TELANGANA

Post A Comment: