CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూమి సాగు సమస్యల పై ప్రభుత్వ విప్ రేగాకు వినతిపత్రం...

Share it:



మన్యం టివీ: జూలూరుపాడు

మండలంలోని సూరారం గ్రామ పంచాయతీ ఆదివాసీ గిరిజన పోడు రైతులు ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావును కలిసినారు. పోడు భూమి సాగు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సూరారం పోడు సాగు రైతులు మాట్లాడుతూ గ్రామంలోని 116 సర్వే నెంబర్లో సుమారుగా 180 ఏకరాలు, ఆదివాసీ గిరిజన రైతులు 60 కుటుంబాలు,  సుమారుగా యాభై సవత్సరాలు గా పోడు సాగు చేసుకుంటున్నామని అట్టి భూమికి గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మూడు రంగుల ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చారని. నాటినుండి ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు పొందినామని. కానీ  అటవీశాఖ అధికారులు అట్టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు చెల్లవని,అట్టి భూమి అటవీ శాఖకు చెందినదని అడవి అభివృద్ధి పనులు చేపడతామని పోడు రైతులను పంటసాగు చేయకుండా అడ్డు పడుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అట్టి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రెగా కాంతారావు కు మణుగూరు క్యాంపు కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజెశామని తెలిపారు. వారు  సానుకూలంగా స్పందించి గిరిజన ఆదివాసీ పోడు సాగు రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారని మన్యం టీవీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సిద్దిబోయిన పుల్లారావు, ఉప సర్పంచ్ బచ్చల రాంబాబు, ముక్తి వెంకటేశ్వర్లు,సిడ్డిబోయిన రామ్మూర్తి,మందేరికిల రాములు, మోహన్ బాబు, కూసం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: