CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కృషి చేయాలి

Share it:

 



బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస్కర్ రెడ్డి


బీజేపీలోకి పలువురు చేరిక

మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండల కేంద్రంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లోడే  శ్రీనివాస్  అధ్యక్షతన రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణుల మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని వారిని మనం మమేకం చేసుకొని బీజేపీ వైపు తిప్పుకోవడమే కార్యకర్తల ప్రధాన లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ములుగులో రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు బూత్ అధ్యక్షులు మండల జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునచ్చారు. కార్యకర్తలు మన పార్టీ విశిష్ఠతను కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు.అలాగే మండలంలోఅన్ని బూత్ కమిటీలను మండల మోర్చ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని గ్రామాల్లోనీ ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని అన్నారు.ఇలా కష్టపడితే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ములుగు నియోజకవర్గ ఎంఎల్ఏ బీజేపీ గెలుచుకుంటుంది అని ధీమా వ్యక్తంచేశారు.జిల్లా అధ్యక్షుని సమక్షంలో కమలాపురం నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు 50 మంది బీజేపీలో చేరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీరా కృష్ణవేణి నాయక్,జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షుడు అల్లె జనార్దన్,జిల్లా కమిటీ కార్యదర్శి పొడెం రవీందర్, జిల్లా మైనార్టీ మోర్చా ఎండి యాకుబ్ భాష,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జినుకుల కృష్ణాకర్,జిల్లా యువమోర్చా అధ్యక్షుడు సురేందర్,జిల్లా కార్యవర్గ సభ్యుడు గంధసిరి శ్రీనివాస్,జిల్లా దళిత మోర్చా కార్యదర్శి ఎం రవీందర్,జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి,జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మహిపాల్ రెడ్డి,నరేందర్,జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి గాలి వేణు,మండల ప్రధాన కార్యదర్శి రావుల జానకి రావు,  మండల యువమోర్చా అధ్యక్షుడు రామగాని అనిల్,పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల విజయ్, బాలమురలి,పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: