CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్రీడల తో మానసిక ఉల్లాసం

Share it:

 


మన్యం టీవి, పినపాక:

పినపాక పాత్రికేయుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను మంగళవారం మణుగూరు ఏఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపియస్ ప్రారంభించారు .మండలంలోని జానంపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో జరిగిన ఈ పోటీలలో పినపాక ప్రెస్ క్లబ్, పోలీస్, రెవెన్యూ, యంపిడివో, ప్రభుత్వ టీచర్లు, టీయస్ జెన్కో, వెటర్నరీ, వ్యవసాయ శాఖ తదితర జట్లు ఈ టోర్నీలో పాల్గోన్నాయి . ప్రారంభ మ్యాచ్ లో పోలీసు ,ప్రభుత్వ టీచర్లు మద్య జరిగిన మ్యాచ్ ను  మణుగూరు ఏఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపియస్ టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు, క్రీడలలో పాల్గోనడం వలన శారీరక ఫిట్నెస్ సాదించడంతో పాటు క్రీడాకారుల మద్య స్నేహ సంబంధాలు మరింత కలిగి ఉంటాయన్నారు పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో అన్నీ ప్రభుత్వ ఉద్యోగులు పాల్గోనడం చాలా సంతోషంగా ఉందన్నారు, నిరంతరం విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి క్రీడా పోటీలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతతో పాటు ఎంతో ఉల్లాసంగా గడిపేందుకు  క్రీడలు దోహదం చేస్తాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక తహసీల్దార్ ఉమా మహేశ్వర రావు, యంపిడీవో శ్రీనివాసులు, ఏడూళ్ల బయ్యారం ఎస్సై టీవీఆర్ సూరి ,స్థానిక సర్పంచ్ బాడస మహేష్, ఆత్మ చైర్మన్ పటేల్ భద్రయ్య, సొసైటీ చైర్మన్ రవి శేఖర్ వర్మ ,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బిల్లా నాగేందర్ బాబు, బూరా శంకర్, సనప భరత్, గంగాధర్, కీసర సుధాకర్ రెడ్డి, ముక్కు మహేష్ రెడ్డి, సంపత్ రెడ్డి ,నిట్టా వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, మూర్తి, కట్టా శ్రీను, బోడ లక్ష్మణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అన్నీ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: